Ashish vidyarthi : ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య స్పందనేంటీ..?

వెండితెరపై విలన్ పాత్రలతో అదరగొట్టే నటుడు ఆశిష్ విద్యార్థి. బాలీవుడ్ లో నటుడుగా తెరంగేట్రం చేసినా విలన్ గా స్టార్డమ్ వచ్చింది దక్షిణాది సినిమాలతోనే కావడం విశేషం. ఎలాంటి పాత్రలో అయినా ఆకట్టుకునే ఆశిష్ విద్యార్థిమే 25న సడెన్ గా రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ పెళ్లి టైమ్ కు ఆయన వయసు 60యేళ్లు. ఆశిష్‌ రెండో భార్య పేరు రూపాలి. కోల్ కతాలో సెటిల్ అయిన అస్సామీ. మరి అతనికి ఎప్పుడో పెళ్లైంది కదా.. ఈ రెండో పెళ్లేంటీ అనే సందేహాలు చాలామందిలో వ్యక్తం అయ్యాయి.

దీంతో బాలీవుడ్ మీడియా అతని మొదటి భార్య రాజౌషీని సంప్రదించి ఆశిష్‌ రెండో పెళ్లి గురించి అడిగింది. దీనికి ఆమె చెప్పిన సమాధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఆశిష్‌ విద్యార్థి కొన్నాళ్లుగా సొంత యూ ట్యూబ్ ఛానల్ లో వీడియో వ్లాగ్స్ చేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ముఖ్యంగా ఫుడ్ వ్లాగ్స్ తో ఆయన ఛానల్ బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆ వీడియోల్లో కొన్ని రోజుల క్రితమే మొదటి భార్యతో చాలా సంతోషంగా ఉన్న వీడియో కూడా ఒకటి ఉంది. మరి ఇంతలోనే రెండో పెళ్లేంటీ అనుకున్నవారికి మొదటి భార్య ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా..? నిజానికి వీళ్లు 2001లోనే విడిపోయారట

. అప్పటి నుంచి అప్పుడప్పుడూ కలిసుకుటున్నా.. భార్య భర్తలుగా విడిపోయి 22యేళ్లైంది. అయితే గతేడాది అక్టోబర్ లోనే చట్ట పరంగా విడాకులకు అప్లై చేశారు. ఆ విడాకులు ఈ యేడాది మంజూరయిందట. అందుకే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆశిష్‌ కు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు ఉన్నాడు అతను ఆస్ట్రేలియాలోని టెస్లాలో జాబ్ చేస్తున్నాడట. అయితే ఆశిష్‌ తో గడిపిన జీవితం తనకు ఎంతో గొప్పది అంటుంది మొదటి భార్య రాజౌశి. మరి వీళ్లు ఎందుకు విడిపోయారు అనేది చెప్పడం లేదు కానీ.. ప్రస్తుతం ఆశిష్‌ విద్యార్థి పెళ్లి వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Telugu 70mm

Recent Posts

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

2 hours ago

‘బ్రహ్మ ఆనందం‘.. తాత మనవళ్లుగా మారిన తండ్రీకొడుకులు

పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…

2 hours ago

‘ప్రతినిధి 2‘ రిలీజ్ ట్రైలర్.. సిస్టమ్ లోని లోపాల గురించి పోరాటం

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలలో ‘ప్రతినిధి 2‘ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. నారా రోహిత్ చాలా గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల…

2 hours ago

Highlights of ‘Arya’ 20 years..!

The movie 'Arya' completed 20 years on May 7. On this occasion, the team specially…

4 hours ago

‘ఆర్య’ 20 ఇయర్స్ హైలైట్స్ ఇవిగో..!

'ఆర్య' సినిమా విడుదలై.. మే 7 తో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా.. ఆనాటి 'ఆర్య' అనుభవాలను ప్రత్యేకంగా…

5 hours ago

Huge Action Episode For ‘Swayambhu’

Nikhil got a hit at pan India level with 'Karthikeya 2'. In a way, it…

6 hours ago