చోళుల స్వర్ణయుగానికి ముందు ఏం జరిగింది..?

ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అది తన రేంజ్ ను బట్టి పెరుగుతూ ఉంటుంది. అయితే మూడు దశాబద్దాల క్రితమే తనకంటూ ఓ రేంజ్ సంపాదించుకున్న దర్శకుడికి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కల అప్పుడు నెరవేరలేదు. అయినా కలల సౌథం ఎప్పటికైనా నిర్మించుకోవాలనుకున్న ఆ క్రియేటివ్ మేన్ ఫైనల్ గా ఆ సినిమా చేశాడు. ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ అని ఎప్పుడో అనిపించుకున్న ఆ డైరెక్టర్ మణిరత్నం. ఆ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. పిఎస్1 అంటూ ఫస్ట్ పార్ట్ గా వస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.

మణిరత్నం.. పరిచయమే అక్కర్లేని పేరు. ఆయన అడుగుజాడల్లో ఎంతమంది సౌత్ దర్శకులు వెళ్లారో చెప్పలేం. ఆయన్లా షాట్ డివిజన్ చేసుకోవాలని, స్టోరీ డీటెయిలింగ్ అంటే అతన్లా చెప్పాలని ఇప్పటికీ చాలామంది తపన పడుతుంటారు. ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించి ఓ పెద్ద లైబ్రరీ మణిరత్నం అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. అలాంటి దర్శకుడికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది. ఆ రేంజ్ కు తగ్గట్టుగానే చోళ రాజుల కథ చెప్పాలని మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటికి కుదిరింది. లేట్ అయినా ఇప్పటి టెక్నాలజీ మణిరత్నంకు అదనపు బలంగా మారింది. అందుకే ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

వెయ్యి సంవత్సరాల క్రితం.. చోళుల స్వర్ణయుగం ప్రారంభం కావడినికి ముందు అంటూ రానా వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్ మొత్తం చోళ రాజ్య స్థాపన కోసం సాగిన పోరాటాల నేపథ్యంలో కనిపిస్తోంది. పాత్రధారులను కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాడు మణిరత్నం. ఒకప్పుడు కమల్ తో చేయించాలనుకున్న పాత్రలో ఇప్పుడు విక్రమ్ చేస్తున్నాడు. కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ప్రభు, జయరాం అంటూ భారీ తారాగణం కనిపిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంతో మణిరత్నం తన కలను నెరవేర్చుకునేందుకు ప్రమోషన్స్ లో కూడా వేగం చూపిస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా బానే కుదిరిందని చెప్పాలి. అయితే చోళ రాజుల కథ అనేది కేవలం తమిళనాడు ప్రాంతానికే ఎక్కువగా పరిమితం అయింది. మరి అలాంటి హిస్టారికల్ కింగ్స్ స్టోరీ ఇండియా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. .

Related Posts