విజువల్ ఫీస్ట్ లా ఆదిపురుష్ ట్రైలర్

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన సినిమా ఆదిపురుష్. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది.

ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అంచనాలకు భిన్నంగా ట్రైలర్ ఈ సారి అద్భుతం అనే టాక్ తెచ్చుకుటోంది. ఏ.ఎమ్.బి మాల్ లో జరిగిన ట్రైలర్ ప్రివ్యూ కు మూవీ టీమ్ మొత్తం హాజరైంది. ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. హనుమంతుడి కోణంలో సాగే కథలా ఈ ట్రైలర్ ఆరంభంలోనే కనిపిస్తుంది.


‘‘ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం.. ’’ అంటూ హనుమంతుడు చెబుతుండగా ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

ఆ వెంటనే భిక్షాందేహీ అంటూ రావణుడు ఎంట్రీ.. సీతను ఎత్తుకుపోవడం కనిపిస్తుంది. సీత తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని సూచిస్తుంది.

ట్రైలర్ ను బట్టి చూస్తే ఆదిపురుష్ రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్ ను మాత్రమే చూపించేలా కనిపిస్తోంది. చివర్లో వచ్చిన రామ రావణ యుద్ధానికి నేటి ఆధునిక టెక్నాలజీని జోడించినట్టు కనిపిస్తోంది. ఇది సినిమాకు ప్రధాన బలంగా ఉండే అవకాశం ఉంది.


విజువల్స్ పరంగా సింప్లీ సూపర్బ్. మొదట్లో వచ్చిన విమర్శలకు దీటైన జవాబులా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి. రాముడు ప్రభాస్, సీతగా కృతి సనన్ జోడీ బావుంది. ఇక 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Telugu 70mm

Recent Posts

‘Gangs of Godavari’ Teaser.. Vishwak Sen Oora Mass Avatar..!

Vishwak Sen, who had a decent hit with 'Gaami', is now coming to the audience…

8 hours ago

Mahesh – Vijay Multistarrer Set This Time?

Tollywood superstar Mahesh Babu and Tamil actor Vijay have a good relationship. Mahesh Babu will…

8 hours ago

జూన్ 27న ‘కల్కి‘.. కొత్త పోస్టర్ తో క్లారిటీ

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఎ.డి' సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే…

10 hours ago

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ టీజర్.. విశ్వక్ సేన్ ఊర మాస్ అవతార్..!

‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రంతో ప్రేక్షకుల…

10 hours ago

కృష్ణ పుట్టినరోజున సుధీర్ బాబు ‘హరోం హర‘

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది.…

11 hours ago

‘రామం రాఘవం‘ టీజర్.. కొత్త పంథాలో తండ్రీకొడుకుల అనుబంధం

కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం 'రామం రాఘవం'. తండ్రీకొడుకుల…

11 hours ago