మండే కూడా మండించారు .. సత్తా చాటిన విక్రమ్,మేజర్

ఏ సినిమాకైనా ఇప్పుడు వీకెండ్ మాత్రమే హోప్స్ ఇస్తోంది. బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప సోమవారం కూడా టికెట్స్ తెగడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఎఫ్ 3 మూవీ పరిస్థితి కూడా అంటే ఐంది. వాళ్ళు ఎంత చెప్పుకున్న మండే నుంచే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అందుకే సోమవారం కూడా టికెట్స్ తెగితేనే ఆ మూవీ మంచి విజయం సాధించిందని అర్థం. ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ మూవీస్ తప్ప మండే కలెక్షన్స్ లేవు. బాట్ చాల రోజుల తర్వాత ఈ వరం మల్లి థియేటర్స్ లో కల కనిపించింది. గత శుక్రవారం విడుదలైన తెలుగు మూవీ మేజర్ తో పటు తమిళ్ దుబ్బింగ్ మూవీ విక్రమ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. మేజర్ విజయం ముందే ఊహించిందే అయినా భారీ కలెక్షన్స్ మాత్రం ఆశ్చర్య పరుస్తున్నాయి. తెలుగు, మలయాళం,హిందీ భాషల్లో విడుదల ఐన మేజర్ ఇప్పటికే ౯౦ శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. సినిమా కూడా ఎమోషనల్ కనెక్ట్ కావడం, కథ ఒరిజినల్ గా జరిగిన ఈ మూవీ లో చూపించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అడవి శేష్ టైటిల్ రోల్ అద్భుతంగా ప్లే చేయడంతో అటు నార్త్ ఆడియన్స్ కూడా మేజర్ మెస్మరైజ్ చేస్తోంది.

ఇక నాలుగేళ్ళ తర్వాత కమల్ హాసన్ మూవీ కి పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ్ లో బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే తెలుగులో కూడా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అనిపించుకుని ఆంధ్రప్రదేశ్ చాల చోట్ల హౌసుఫుల్ గా నడుస్తోంది. సోమవారం రోజు కూడా స్టడీ గా ఉండటం అదీ ఒక చిన్న సినిమా మరో డబ్బింగ్ సినిమా ఇలా సోమవారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయంటే కారణం కంటెంట్. ఈ రెండు సినిమాల్లో మేజర్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే కథ. విక్రమ్ యాక్షన్ తో మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. పైగా చాల కలం తర్వాత కమల్ హాసన్ చేసిన యాక్షన్ మూవీ కావడం తో ఆయన అభిమానులు కూడా విక్రమ్ ను రెండుమూడుసార్లు చూస్తున్నారు. ఏమైనా మంచి కథలు లేదా ఆకట్టుకునే మూవీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు అనేందుకు ఈ రెండు సినిమాలు మరోసారి మంచి ఉదాహరణలుగా నిలిచాయి.

Related Posts