గెటప్ లతో ఆడియన్స్ ను భయపెడుతోన్న హీరో

గెటప్పులు కామెడీ అయిన కాలంలో వాటి నేపథ్యంలో రాసుకున్న కథలు మాత్రం ఆకట్టుకుంటాయా. పోనీ ఆ కథలు బలంగా ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ కేవలం గెటప్ లే ఎజెండాగా సినిమాలు వస్తే మాత్రం ప్రేక్షకులు థియేటర్స్ లో కోబ్రాల్లా బుసలు కొట్టి బాక్సాఫీస్ ను కాటేస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విక్రమ్ విషయంలో ఇదే జరుగుతోంది. అతను “కథలు వినడానికి ముందే ఎన్ని గెటప్ లు ఉంటాయి” అని అడిగే టైప్ అంటూ చాలాకాలంగా సెటైర్స్ పడుతున్నాయి.

అందుకు తగ్గట్టుగానే గెటప్ లనే నమ్ముకుని విక్రమ్ చేసిన ప్రయత్నాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇంకా చెబితే కేవలం ఇతని గెటప్ ల పిచ్చి వల్లే మంచి సినిమాలూ పోయిన సందర్భాలున్నాయి. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మల్లన్న. మల్లన్న వచ్చిన టైమ్ లోనే రజినీకాంత్ శివాజీ సినిమా వచ్చింది. రెండూ అవినీతికి వ్యతిరేకంగా సాగే కథలే. మల్లన్నలో విక్రమ్ సిబిఐ ఆఫీసర్ గా స్టైలిష్ యాక్షన్ తో అదరగొడతాడు. తను అవినీతి పరులను ఆడుకునే టైమ్ లోనూ.. ఫైట్స్ లోనూ హాలీవుడ్ రేంజ్ క్లాసీ పర్ఫార్మెన్స్ చూపించాడు. బట్ ఎప్పుడైతే అతను గెటప్ లతో కొన్ని ఎపిసోడ్స్ కు దిగాడో అప్పుడే సినిమా పై ఇంట్రెస్ట్ పోతుంది. మల్లన్న ఖచ్చితంగా విక్రమ్ గెటప్ ల పిచ్చి వల్లే మంచి కంటెంట్ ఉన్నా పెద్ద విజయం సాధించలేదు అని చెప్పొచ్చు. ఆ పిచ్చిని అతను దాటి ఉంట మల్లన్న శివాజీ కంటే మంచి సినిమా అయి ఉండేదని అప్పుడూ, ఇప్పుడూ చాలామంది విశ్లేషకులు చెబుతారు.


ఇక లేటెస్ట్ గా వచ్చిన కోబ్రాలో సైతం ఇంతే. దాదాపు పది గెటప్ ల వరకూ ఉంటాయి. ఇవేవీ కథలను సపోర్ట్ చేయవు. ఒకటీ రెండూ ఎపిసోడ్ పరంగా ఆకట్టుకున్నా.. కథలను సపోర్ట్ చేయని గెటప్ ల వల్ల ఎవరికైనా ఏం ఉపయోగం ఉంటుంది. నిజానికి అతని గెటప్ ల పిచ్చి వల్లే ఫేస్ లో చాలా మార్పులు వచ్చాయి. రకరకాల మేకప్ లు వాడటంతో మొహంలో ముసలితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. లేదంటే అతనిలో యంగ్ లుక్ ఇంకా అలాగే ఉండేది. ఏదేమైనా బలమైన కథలు లేకుండా కేవలం గెటప్ లు ఉన్నాయని సినిమాలు ఒప్పుకుంటే ఇలాగే డిజాస్టర్స్ వస్తాయి. నిజానికి కమల్ హాసన్ చేసిన దశావతారం గెటప్ ల సినిమాలకు దాదాపు ఎండ్ కార్డ్ వేసింది. అయినా ఇంకా వాటినే పట్టుకుని వేళాడాతానంటే ఎవరేం చేస్తారు.. ఎవరు మాత్రం ఇంకా విక్రమ్ సినిమాలు చూస్తారు..?

Related Posts