వీధిపోరాటలకు దిగుతోన్న డిజే టిల్లు

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకోవడం కంటే స్టార్ హీరో అనిపించుకోవడం అనేది ఏ హీరో కైనా ఇంపార్టెంట్. అలా అనిపించుకునేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. రీసెంట్ గా డిజే టిల్లు సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుని సిద్ధు అలియాస్ టిల్లు అయిపోయాడు. రీసెంట్ గా ఈ మూవీకి సీక్వెల్ చేస్తారు అనే మాట వినిపించింది. ఆ తర్వాత ఓ మళయాల మూవీ రీమేక్ చేస్తున్నాడన్నారు. బట్.. ఇప్పుడా మూవీ మారింది. మరో రీమేక్ తో రాబోతున్నాడు డిజే టిల్లు.. సారీ సిద్ధూ. మరి ఆ మూవీ ఏంటీ.. ఏ భాష నుంచి.. ?


జొన్నలగడ్డ సిద్ధు అంటే సడెన్ గా తెలియడం లేదు.. డిజే టిల్లు అంటే మాత్రం వెంటనే తెలిసిపోతుంది. ఈ మూవీతో ఆ రేంజ్ ఇంపాక్ట్ వేశాడు అతను. కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి రైటర్. మల్టీ టాలెంటెడ్. అందుకే స్టోరీ సెలక్షన్ లోనూ ఆ వైవిధ్యం కనిపిస్తుంది. డిజే టిల్లుకు ముందు చేసిన గుంటూర్ టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాథ వినుమా చిత్రాలతోనూ మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన డిజే టిల్లు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకలను ఎంటర్టైన్ చేసిందీ మూవీ. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తో రాబోతున్నారు అని చెప్పారు. బట్.. సడెన్ గా ఓ రీమేక్ కు ఓటేశాడు సిద్ధు. అది కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే అంటున్నారు.


సితార బ్యానర్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ కదా..? డిజే టిల్లు కూడా ఆ బ్యానర్ లో వచ్చిందే. ఈ సీక్వెల్ కూడా ఆ బ్యానర్ లోనే రావాలి. బట్ మధ్యలో మళయాల హిట్ మూవీ కపేలాను సిద్ధు హీరోగా రీమేక్ చేస్తాడు అనే వార్తలు వచ్చాయి. బట్ ఈ మూవీలో అతనిది కాస్త నెగెటివ్ రోల్ లా ఉంటుంది. అందుకే కపేలా నుంచి తప్పుకున్నాడు సిద్ధూ. బట్ లేటెస్ట్ గా మరో మళయాల సినిమానే రీమేక్ చేసేందుకు ఓకే చెప్పాడు. టోవినో థామస్ హీరోగా నటించిన ఆ సినిమా తుల్లిమాల. ఆగస్ట్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సిద్ధూకు పర్పెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు.

ఆ మ్యాడ్ నెస్, క్రేజీ కంటెంట్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా ఉన్న ఈ మూవీకి మాలీవుడ్ లో మంచి అప్లాజ్ వచ్చింది. పైగా ట్రైలర్ చూస్తే సిద్ధూ బాడీ లాంగ్వేజ్ కు బాగా సరిపోతుందనిపిస్తోంది. ఇది స్ట్రీట్ ఫైట్స్ నేపథ్యంలో నడిచే కథ. అలాగని మరీ సిల్లీగా ఉండదు. చిన్న చిన్న గొడవలు పెట్టుకునే గ్యాంగ్స్ ప్రతీ టౌన్ లోనూ కనిపిస్తాయి కదా.. అలాంటి వారి నేపథ్యంలో ఉంటుంది. మరి ఈ మూవీకి రెడీ అవుతాడా లేక.. డిజే టిల్లు సీక్వెల్ తర్వాత చేస్తాడా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Related Posts