పురాణ పురుషుడు శ్రీరాముడి కథను వెండితెరపై ఇప్పటికే ఎన్నోసార్లు ఆవిష్కరించారు. పోయినేడాది ప్రభాస్ శ్రీరాముడుగా నటించిన ‘ఆదిపురుష్‘ విడుదలైంది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ‘ఆదిపురుష్‘ విఫలమయ్యింది. తాజాగా రణ్ బీర్ కపూర్ రాముడుగా మరో రామాయణంను వెండితెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
చాన్నాళ్ల క్రితమే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడు భాగాలుగా ‘రామాయణం‘ సినిమా రూపొందిస్తామని ప్రకటించారు. అప్పుడు ఆ చిత్రానికి దర్శకుడిగా ‘దంగల్‘ ఫేమ్ నితీష్ తివారి ని ప్రకటించారు. ఇప్పుడు అదే దర్శకుడు నితీష్ తివారి.. రణ్ బీర్ రాముడుగా, సాయిపల్లవి సీతగా.. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా ‘రామాయణం‘ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ‘యానిమల్‘ మూవీతో అభిమానులకు మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చిన రణబీర్ కపూర్ ఇప్పుడు డివోషనల్ వే లోకి వెళ్లబోతున్నాడన్నమాట. ఈ సినిమాలో శ్రీరాముడు పాత్ర పోషించడం కోసం రణ్ బీర్.. ఆల్కహాల్ కి, నాన్ వెజిటేరియన్ కి దూరంగా ఉండబోతున్నాడనే ప్రచారం బీటౌన్ సర్కిల్స్ లో జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. రణ్ బీర్ ‘రామాయణ్‘లో మిగతా కాస్టింగ్ ఎంపిక పనులు పూర్తవుతున్నాయట. ఈ సినిమాలో విభీషణుడి పాత్ర కోసం తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారట. రావణుడి మరో తమ్ముడు కుంభ కర్ణుడిగా బాబీ డియోల్.. హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నారనేది బాలీవుడ్ టాక్. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
Not only the first song from 'Devara'.. the second song is also coming as a…
Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…
Natural Star Nani is on a good streak. He has a string of hits to…
తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…
ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…
నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…