విజయ్ దేవరకొండ హ్యాండ్ ఇవ్వలేదు.. సమంతను వదల్లేదు..

సక్సెస్ ను బట్టే ఆఫర్స్ ఉండే పరిశ్రమ ఇది. హిట్ కొడితే వెంట పడతారు. ఒక్క ఫ్లాప్ వస్తే పలకరింపులు కూడా ఉండవు. స్మాల్ హీరోల నుంచి స్టార్స్ వరకూ ఇది వర్తిస్తుంది.అలాగే దర్శకుల విషయంలోనూ జరుగుతుంది. ఒక దర్శకుడు ఫ్లాప్ ఇస్తే.. ఆల్రెడీ అతనికి కమిట్ అయిన హీరోలు ఇంక పట్టించుకోరు. కానీ తాను ఆ కేటగిరీ కాదని ప్రూవ్ చేసుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ తో రెడీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈచిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.
లైగర్ టైమ్ లోనే విజయ్ దేవరకొండ .. శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే మధ్యలో విడుదలైన శివ సినిమా టక్ జగదీష్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇక విజయ్ అతనికి అవకాశం ఇవ్వడు అనే అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే లైగర్ తర్వాత మళ్లీ పూరీ జగన్నాథ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఏకంగా ఓపెనింగ్ కూడా జరిపారు. పైగా ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన జనగణమన అన్నారు కాబట్టి.. ఇక శివ నిర్వాణతో సినిమా ఉండదనే ఫిక్స్ అయ్యారు. బట్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ విజయ్ ఈ ప్రాజెక్ట్ ను కూడా స్టార్ట్ చేశాడు.
విజయ్, శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఈ నెల 21న ప్రారంభం కాబోతోంది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించబోతోందనేది కూడా అఫీషియలే. ఈ చిత్రంలో నటించేందుకు సమంత చాలా సొంత ప్రయత్నాలు చేసిందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. అది నిజమే ఇప్పుడు తెలుస్తోంది. లేదంటే ఈ మూవీలో ముందుగా ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు వీళ్లు ప్రయత్నించారు. కానీ సమంత ఒత్తిడికి హీరోతో పాటు నిర్మాణ సంస్థ కూడా తలొగ్గక తప్పలేదు.
ఇంతకు ముందు మహానటి సినిమాలో సమంత, విజయ్ కలిసి నటించారు. కానీ అది రెగ్యులర్ మూవీ కాదు. ఏదేమైనా ఇదో రొమాంటిక్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇప్పుడు సమంత లాంటి హీరోయిన్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ ఎందుకు రాలేదో కానీ.. సమంత, విజయ్ దేవరకొండ పెయిర్ గా సినిమా రాబోతోందన్నమాట. అన్నీ కుదిరితే ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదలవుతుంది.

Telugu 70mm

Recent Posts

Yashika Aannand

13 mins ago

Daksha Nagarkar

19 mins ago

Rashi Singh

23 mins ago

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

1 hour ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

2 hours ago

Mirnalini Ravi

2 hours ago