సంపూర్ణేష్ బాబు అతి తక్కువ టైమ్ లోనే నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన స్టార్ విజయ్ దేవరకొండ. తను ఎంచుకున్న కథలతోనే ముందుకు వెళుతోన్న విజయ్ కి అర్జున్ రెడ్డి ఇచ్చిన క్రేజ్, మైలేజ్ చాలా పెద్దది. స్వతహాగా మంచి యాక్టర్ కూడా కావడంతో ఇప్పుడున్న యంగ్ హీరోల లిస్ట్ లో చాలా వేగంగా దూసుకుపోతున్నాడు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తోన్న విజయ్ దేవరకొండ అవేం పట్టించుకోకుండా ఇతర హీరోలూ ఆశ్చర్యపోయేలా ఏకంగా ప్యాన్ ఇండియన్ సినిమానే చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తోన్న లైగర్ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే రిలీజ్ కాబోతోంది. నిజానికి ఈ మూవీ మొదట్లో తెలుగు సినిమాగానే స్టార్ట్ అయింది. కానీ కరణ్ జోహార్ ఎంట్రీతో ప్యాన్ ఇండియన్ సినిమాగా మారింది. అటు చార్మీ కూడా పావులు కదపడంతో పూరీ కూడా ఓకే చెప్పాడు. దీంతో కథలో కొన్ని కీలక మార్పులు చేసి హీరోయిన్ ను కూడా బాలీవుడ్ భామనే తీసుకున్నారు. సో విజయ్ సరసన ఇప్పుడు అనన్య పాండే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. రీసెంట్ గానే చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్న ఈమూవీలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. లెజెండరీ రియల్ బాక్సర్ మైక్ టైసన్ విలన్ గా నటించాడు.
ఆగస్ట్ 25న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి ఆమధ్య విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఓ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ ఇచ్చింది. అయితే ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయని ఈ లైగర్ నుంచి లేటెస్ట్ గా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఓ చిన్న పూలగుత్తి అడ్డుపెట్టుకుని విజయ్ దేవరకొండ న్యూడ్ గా ఉన్న పోస్టర్ అది. ఇలాంటి పోస్టర్ గతంలో ఆమిర్ ఖాన్ పికే కోసం చేశాడు. అతన్ని పేరడీ చేస్తూ తెలుగులో సంపూర్ణేష్ బాబు కూడా చేశాడు. అలాంటి స్టిల్ ను విజయ్ కూడా చేయడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. కంటెంట్ ఏదైనా .. ఇందులో కొత్తదనం లేదు. మరీ సంపూర్ణేష్ కూడా వాడిన క్రియేటివిటీతోనే విజయ్ ని ఇలా చూపిస్తాడా పూరీ అంటూ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. మరి దీనికి లైగర్ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో సులువుగానే ఊహించొచ్చు. ఎందుకంట ఆ టీమ్ అంతా డోంట్ కేర్ బ్యాచ్ కదా..?
‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల…
The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన…
Energetic star Ram, who came before the audience with last year's movie 'Skanda', is going…
Lady directors are now on the rise in the Telugu film industry. Veteran actresses like…
On one side, the heat of the election, on the other, IPL. With this, there…