దిలీప్‌ , రెజీనాల ఫస్ట్‌ కిస్‌

ఉత్సవం .. ఈ మధ్యకాలంలో కళాకారుల బ్యాక్‌డ్రాప్‌తో కూడిన కథలొస్తున్నాయి. రీసెంట్‌ గా బ్రహ్మానందం అద్భుతంగా స్పందించిన సినిమా ఉత్సవం. ఈ సినిమాలో దిలీప్‌ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా నటించారు. హార్న్‌బిల్ పిక్చర్స్ బ్యానర్‌లో అర్జున్‌ సాయి డైరెక్షన్‌లో సురేష్‌ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఉత్సవం టైటిల్‌ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుండి , ఫస్ట్‌లుక్‌, టీజర్‌ లతో మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఇదే జోష్‌లో ఫస్ట్‌ సింగిల్‌ ను రిలీజ్‌ చేసారు. హీరో హీరోయిన్ల ఫస్ట్‌ కిస్‌ గురించి యూత్‌ను ఆకట్టుకునేలా అనంత శ్రీరామ్‌ రాసిన లిరిక్స్‌తో అనూప్‌రూబెన్స్ కట్టిన బాణీ ఆకట్టుకుంటుంది.


అనుకోకుండా హీరోయిన్ హీరో ను ముద్దు పెట్టడంతో హీరో తన అనూభూతిని ఫ్రెండ్స్‌కు చెప్పే సందర్భంగా ఈ పాటను కంపోజ్‌ చేసినట్టు తెలుస్తోంది. రెజీనా, దిలీప్ ప్రకాశ్‌ల కెమెస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. విజువల్స్‌ బాగున్నాయి. ఈ చిత్ర ఆల్బమ్‌ లహరి మ్యూజిక్ లేబుల్‌ రైట్స్ తీసుకుంది.

Related Posts