ఉస్తాద్ రామ్ ఓ రేంజ్ ఆఫర్

రామ్.. కెరీర్ మొదలుపెట్టిన చాలా యేళ్లైనా తనదైన శైలిలో రాణిస్తున్నా.. ఎందుకో ఓ ఖచ్చితమైన ఇమేజ్ మాత్రం సంపాదించలేకపోయాడనే చెప్పాలి. వైవిధ్యమైన సినిమాలు చాలానే చేశాడు. కానీ అతని రేంజ్ మారలేదు. ఫ్యాన్స్ ఉన్నా.. పర్టిక్యులర్ ఇమేజ్ ఇచ్చే కిక్ వేరే కదా. ఆ విషయంలో కొన్నాళ్ల క్రితం వరకూ వెనకబడి ఉన్న రామ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాడు పూరీ జగన్నాథ్. పూరీతో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో ఓవర్ నైట్ మాస్ హీరోగా దుమ్మురేపాడు. ఈ సినిమాతో తన పేరుకు ముందు ఉస్తాద్ అనే ట్యాగ్ ను సైతం ధైర్యంగా తగిలించుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అటు హిందీ బెల్ట్ లోనూ ఇరగదీసింది. మరోవైపు రామ్ కు హిందీ డబ్బింగ్ మార్కెట్ ను అంతకు ముందు కంటే డబుల్ చేసిందీ సినిమా. అయితే ఇస్మార్ట్ మూవీ తర్వాత చేసిన  రెడ్ సినిమా నిరాశపరిచినా.. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘ద వారియర్’అంటూ రాబోతున్నాడు.
ఒకప్పుడు కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అనిపించుకున్నా.. తర్వాత వరుస ఫ్లాపులతో చాలా వెనకబడిపోయిన దర్శకుడు లింగుస్వామితో బై లింగ్వుల్ గా తెరకెక్కుతోన్న చిత్రమే ఈ వారియర్. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అక్షర గౌడ్ ఓ కీలక పాత్ర చేస్తుండగా.. తన కెరీర్ లో ఇప్పటి వరకూ చేయనంత క్రూయల్ విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఇక ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ పోస్టర్ లో యంగ్ కాప్ గా పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం బాడీ మేకోవర్ చేస్తుండగానే జిమ్ లో గాయపడ్డాడు రామ్. అయితేనేం.. ఆ గాయానికి సరైన రిజల్ట్ వస్తుందనేలా ఉందీ సినిమా.
ఇక అసలు విషయం ఏంటంటే.. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో కాబోలు.. ద వారియర్ హిందీ డబ్బింగ్ కు అద్భుతమైన రేట్ వచ్చింది. నిజంగా ఇది రామ్ మార్కెట్ తో పోలిస్తే ఎవరూ ఊహించనిది. యస్.. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్ 16కోట్లు పలికింది. షాకింగ్ ప్రైస్ కదూ. అవును మరి ఒకప్పుడు రామ్ సినిమాల బడ్జెట్టే ఇంత ఉండేది. అలాంటి డబ్బింగ్ రైట్స్ కే ఈ రేంజ్ ప్రైస్ వచ్చాయంటే కారణం ఖచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు లింగుస్వామి ఫామ్ లో లేడు. అయినా ఈ భారీ అమౌంట్ రావడం అనేది కేవలం రామ్ క్రెడిట్ గానే చెప్పాలి. ఏదేమైనా ఉస్తాద్ ఆఫర్ అనిపించింది కదా ఇదీ..

Telugu 70mm

Recent Posts

భయపెట్టడానికి వస్తోన్న భరత్ ‘మిరల్’

'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ 'మిరల్'. 'స్కేర్' అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. భరత్ కి…

2 hours ago

‘దేవకి నందన వాసుదేవ’ నుంచి రొమాంటిక్ మెలోడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. తొలి సినిమా…

2 hours ago

మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…

20 hours ago

‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ…

20 hours ago

‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…

20 hours ago

ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…

21 hours ago