ప్రేమికులరోజు కానుకగా ‘ట్రూ లవర్’

డైరెక్టర్ మారుతి, ఎస్.కె.ఎన్. సంయుక్త నిర్మాణంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోన్న ప్రేమకథా చిత్రం ‘ట్రూ లవర్’. ‘జై భీమ్, గుడ్ నైట్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మణికందన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. ప్రేమికులరోజు కానుకగా ఫిబ్రవరి 10న ‘ట్రూ లవర్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభురామ్ వ్యాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఆరేళ్లపాటు రిలేషన్ లో ఉన్న లవర్స్ తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లారా? లేదా? అనేదే ఈ సినిమా కథాంశంగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

Related Posts