త్రివిక్రమ్, సందీప్ కంటే ముందే అతనితో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచబోతున్నాడు. మూడేళ్లుగా ‘పుష్ప‘ గెటప్ లోనే ఉన్న బన్నీ.. ఇకపై వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి ప్లానింగ్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ అఫీషియల్ గా రెండు సినిమాలను ప్రకటించాడు. వాటిలో ఒక చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాగా.. మరొక సినిమాని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నాడు.

‘అల.. వైకుంఠపురములో‘ తర్వాత గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంస్థలు సంయుక్తంగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాని నిర్మించబోతున్నాయి. ప్రస్తుతం ‘గుంటూరు కారం‘తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఆ తర్వాత బన్నీ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నాడు. అయితే.. ఈసారి మాటల మాంత్రికుడు ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశాడు. దాంతో.. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయమే పట్టనుంది.

‘యానిమల్‘తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనూ అల్లు అర్జున్ సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబో మూవీని టి-సిరీస్ నిర్మించబోతుంది. ప్రభాస్ తో ‘స్పిరిట్‘ సినిమా పూర్తిచేసిన తర్వాతే బన్నీ సినిమాని చేయనున్నాడట సందీప్ రెడ్డి. మరోవైపు.. ‘పుష్ప 2‘ తర్వాత అటు త్రివిక్రమ్ కానీ.. ఇటు సందీప్ రెడ్డి వంగా తో కానీ సినిమాని పట్టాలెక్కించడట బన్నీ. వీరిద్దరి కంటే ముందే ‘జవాన్‘ డైరెక్టర్ అట్లీతో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట.

షార్ట్ పీరియడ్ లోనే కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అట్లీ. ఈ ఏడాది ‘జవాన్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అట్లీ సృష్టిస్తోన్న కలెక్షన్ సునామీ గురించి తెలిసిందే. ‘జవాన్‘ తర్వాత అట్లీ చేయబోయే సినిమా అల్లు అర్జున్ తోనే అనేది ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అట్లీ.. అల్లు అర్జున్ కి ఓ స్టోరీ చెప్పడం.. దానికి ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో వీరిద్దరి కాంబో మూవీ తెరకెక్కనుందట. త్వరలోనే అల్లు అర్జున్-అట్లీ మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

Related Posts