‘డెవిల్‘ గురించి నవీన్ మేడారం ఓపెన్ లెటర్

సినిమా అంటేనే సమిష్టి కృషి. ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో కొన్నిసార్లు వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ రావడం సహజం. ‘డెవిల్‘ మూవీ విషయంలో అదే జరిగింది. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ముందుగా అనుకున్న దర్శకుడు నవీన్ మేడారం. పలు హాలీవుడ్ మూవీస్ కి విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టుగా పనిచేసిన నవీన్ మేడారం.. ‘బాబు బాగా బిజీ, సిన్‘ వంటి సినిమాలనూ తెరకెక్కించాడు. ఇక.. ‘డెవిల్‘ మూవీ రిలీజ్ కు కొన్ని రోజుల ముందు వరకూ దర్శకుడిగా నవీన్ మేడారం పేరే వినిపించింది. అయితే.. ఏమైందో ఏమో ఈ సినిమా నుంచి దర్శకుడిగా నవీన్ మేడారం ను తప్పించి.. ఆ క్రెడిట్ ను నిర్మాత అభిషేక్ నామా వేసుకున్నారు.

లేటెస్ట్ గా ఈ విషయంపై దర్శకుడు నవీన్ మేడారం క్లారిటీ ఇస్తూ ఓ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు. ‘డెవిల్‘ కోసం తాను మూడేళ్లపాటు పనిచేశానని.. స్క్రిప్ట్ ను రాయడం దగ్గర నుంచి.. స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ సెర్చింగ్.. ఇలా ప్రతీ విషయంలోనూ తన పార్టిసిపేషన్ ఉందని తెలిపాడు. కారైకుడి, వైజాగ్, హైదరాబాద్ వంటి లొకేషన్స్ లో 105 రోజుల పాటు మొత్తం సినిమాని తానే షూట్ చేశానన్నాడు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి కొంచెం ప్యాచ్ వర్క్ మాత్రం తాను చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా మేకింగ్ లో తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఈగో అండ్ గ్రీడ్ వలన తీసుకున్న కొన్ని కేర్ లెస్ డెసిషన్స్ వలనే తాను సినిమా నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నాడు. అలాగే.. ఈ మూవీ మేకర్స్ పై తాను ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం లేదని ఈ సందర్భంగా తన లెటర్ లో క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ గారు వంద శాతం ఎఫర్ట్ పెట్టారని.. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నాడు నవీన్ మేడారాం. మ