టాలీవుడ్ కు వెన్నుముక పూర్తిగా పట్టు తప్పిందా ..?

సినిమా, రాజకీయాలు దాదాపు వేర్వేరు కాదు. దశాబ్దాల నుంచే ఈ రెండూ పెనవేసుకుని ఉన్నాయి. హీరోలు సి ఏం లు అయ్యారు. సి ఏం లు హీరోలతో ప్రచారం చేయించుకుని గెలుస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి సౌత్ లో తెలుగు, తమిళ్ హీరోల మధ్య గొప్ప సఖ్యత ఉంది. ముఖ్యంగా గత తరం హీరోల మధ్య. ఒకరి ఫంక్షన్స్ కు ఒకరు హాజరవుతారు కూడా. అలాంటి హీరోలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించడం మినిమం కర్టేసి. బట్ తెలుగు లో మాత్రం అది కనిపించడం లేదు.మన హీరోలు రాజకీయ నాయకులకు భయపడుతున్నారు అనేది కొన్నాళ్లుగా స్పష్టంగా అర్థం అవుతోంది. ముఖ్యంగా ఏ.పి సిఏం అంటే తెగ భయపడుతున్నట్టు కనిపిస్తోంది.

లేదంటే ఇండియా మొత్తమ్ సూపర్ స్టార్ గా చూసే రజినీకాంత్ తెలుగు వారు గర్వించే నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకల ముగింపు సభకు ముఖ్య అతిథిగా వస్తే .. దాన్ని మరో రాజకీయ పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకుని రజిని ని అసభ్యంగా తిడితే కనీసం ఒక్క హీరో కూడా స్పందించలేదు. రజిని వచ్చింది పొలిటికల్ మీటింగ్ కు కాదు. ఆయనేమీ రాజకీయ ప్రసంగం కూడా చేయలేదు. అయినా కొందరు వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్టు బూతులతో విరుచుకు పడితే.. కనీసం ఇది పద్ధతి కాదు అని ఒక్క మాట కూడా అనలేకపోయారు అంటే మన హీరోలు అక్కడి సిఏం కు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతోంది.


ఆఫ్ కోర్స్ మేమెందుకు స్పందించాలి అని కొందరు అనొచ్చు. కానీ వీరంతా మేము గొప్ప ఫ్రెండ్స్ అని అవసరం లేకపోయినా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా ఒకరి సినిమా ప్రమోషన్స్ లో ఒకరు గెస్ట్ లు గా కూడా హాజరయ్యారు. ఒకరి వారసులను ఒకరు దీవించారు. సరే ఇవన్నీ పక్కకు పెట్టినా వేరే భాష వాడే అయినా తోటి నటుడిని అంతలేసి మాటలు అంటుంటే కాస్త హుందాగా మాట్లాడితే మంచిది అని కూడా చెప్పలేకపోయారు. ఇలాంటి సిట్యుయేషన్ రేపు వేరే భాషలో మన హీరోలకు ఇంకేదైనా రూపంలో ఎదురైతే అప్పుడు వాళ్ళు మాత్రం ఎలా స్పందిస్తారు..? ఈ తీరు చూస్తోంటే తెలుగు సినిమా ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారింది అనిపించక మానదు.


ఈ విషయం లో మాట్లాడితే మన సినిమాలను ఏం చేస్తారో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. కనీసం రజినీకాంత్ నా బెస్ట్ ఫ్రెండ్ అని వేదికలపై కూడా వాడు వీడు అని పిలిచే మోహన్ బాబు కానీ.. మెగాస్టార్ కానీ ఒక్క మాట అనలేక పోయారంటే తెలుగు సినిమా వాళ్ళ వెన్నెముక ఎంతలా వంగిపోయిందో తెలుస్తోంది. ఏదేమైనా .. ఈ రెండు రంగాలు కలిసి ఉంటే బావుంటుంది. అంటే కానీ ఒకరికి భయపడుతూ ఇలా ఎంత కాలం అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కనీసం అశ్వనీదత్ లా కూడా ఎవరూ రియాక్ట్ కాలేదంటే ఆ సియం కు వీళ్ళు ఎంత భయపడుతున్నారు అనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదేమైనా ఇలాంటప్పుడే ఇండస్ట్రీ కి దాసరి లాంటి ఒక డేరింగ్ పర్సన్ కావాలి అని మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది.

Related Posts