మరోసారి పోలీస్ పవర్ చూపించబోతున్న బెల్లంకొండ

కొంతమంది హీరోల కటౌట్ లకు పోలీస్ పాత్రలు పర్ఫెక్ట్ గా సూటవుతాయి. అలాంటి వారిలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. ఇప్పటికే ‘కవచం, రాక్షసుడు‘ వంటి చిత్రాల్లో పోలీస్ పవర్ చూపించిన బెల్లంకొండ.. మరోసారి సిల్వర్ స్క్రీన్ పై పోలీస్ గా అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భీమ్లా నాయక్‘ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘బి.ఎస్.ఎస్.10‘ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తోన్న ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్.. తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా కనిపించబోతున్నట్టు ఓ స్పెషల్ నోటీస్ ను రిలీజ్ చేసింది టీమ్. ‘ప్రజాహితముకై జారీ చేయడమైనది..‘ అంటూ ఈ మూవీలో బెల్లంకొండ పోషించే పోలీస్ పాత్రకు సంబంధించిన డిటెయిల్స్ ను నోటీస్ రూపంలో అందించారు మేకర్స్. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారట.

Related Posts