ఈ ముఖచిత్రం కలర్ ఫోటోను మించేలా ఉందే

బుల్లి ప్లాట్ ఫామ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన దర్శకులు చాలామందే ఉన్నారు. వారిలో సందీప్ రాజ్ ఒకడు. సుహాస్ తో కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసిన అతను రీసెంట్ గా కలర్ ఫోటో అనే చిత్రంతో దర్శకుడయ్యాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. రెవిన్యూ కూడా ఫర్వాలేదు. విశేషం ఏంటంటే.. మొదటి సినిమాతోనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ ఇష్యూను పవర్ ఫుల్ గా, పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. అతని తర్వాతి చిత్రమే ఈ ‘ముఖచిత్రం’. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
ముఖచిత్రం టైటిలే ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ డిజైన్స్ కూడా ఆసక్తిగా కనిపించాయి. దీంతో చాలామంది ఈ చిత్రం గురించి ఆలోచించారు. వారి ఆలోచనను అంచనాగా మార్చేలా కట్ చేశారీ టీజర్. యస్.. ముఖచిత్రం టీజర్ చూస్తే ప్రతి ఫ్రేమ్ పక్కాగా కనిపిస్తోంది. మరోసారి వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు డాక్టర్స్ .. వారి లైఫ్ లో జరిగిన సంఘటనలు.. అందులో వారి భార్యల పాత్రలు.. హ్యాపీ లైఫ్ అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా కథలో ట్విస్ట్ లు మొదలు కావడం.. వంటి సన్నివేశాలతో సరదాగా మొదలైన టీజర్ సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయింది. రొమాన్స్ తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్స్ చాలా ఉండేలా ఉన్నాయీ సినిమాలో. అవన్నీ ఎలివేట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా కట్ చేశారు టీజర్.
ఇక ఈ సారి కూడా చాలా వరకూ కొత్తవాళ్లతోనే వస్తున్నాడు సందీప్ రాజ్. అలాగని వీరు నటనకు కొత్త కాదు. వెండితెరకు కాస్త కొత్త అంతే. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించినా.. ప్రధాన పాత్రల్లో నటించిన వారు మెయిన్ ఆర్టిస్ట్ లుగా ఈ చిత్రంతో రాబోతున్నట్టు కనిపిస్తోంది. యూ ట్యూబ్ లో
‘‘21 వెడ్స్ 30’’ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఫేమ్ అయిన చైతన్య రావుతో పాటు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లోనూ కనిపించిన ప్రియా వడ్లమాని, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్, సునిల్ కీలక పాత్రల్లో నటించారు. సునిల్ ను కలర్ ఫోటోలో విలన్ గా చూపించాడు దర్శకుడు సందీప్ రాజ్. మరి ఈ సారి ఎలాంటి పాత్రతో ప్రెజెంట్ చేయబోతున్నాడో కానీ.. ఈ టీజర్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గానూ ప్రామిసింగ్ గానూ కనిపిస్తోంది.

Related Posts