ఎఫ్3 నిర్మాతల సంచలన నిర్ణయం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం పిచ్చోడు చేసే పని. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా అదే పనిలో బిజీగా ఉంది. ఆ కారణంగానే జనాలు థియేటర్స్ వైపు రావడం లేదు. ఈ విషయంలో అందరూ చేస్తోన్న తప్పులు చేయొద్దు అని ఎఫ్3 ప్రొడ్యూసర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ జంటలు నటించిన ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కలెక్ట్ చేసి కామెడీ సినిమాలకు ఉండే కెపాసిటీని చూపించింది.అప్పుడు పెద్ద పోటీలో ఉన్నా..ఆ పెద్ద సినిమాలన్నీ పోవడం కూడా ఎఫ్2కు కలిసొచ్చింది. ఇప్పుడు సోలో రిలీజ్. వేరే చిత్రాలున్నా.. అన్నీ చిన్నవే. పైగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఎఫ్3 ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ఆసాంతం హిలేరియస్ గా ఉందనే టాక్ తెచ్చుకుంది. సినిమా వాళ్లు మాత్రం ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని ఊరించారు కూడా. అందుకే ఎఫ్3 కూడా ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా నవ్విస్తుందనే నమ్మకాన్న సొంతం చేసుకుంది. విడుదలకు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఇంక ప్రమోషన్స్ తో పాటు ఇతరత్రా అంశాలన్నీ కలుపుకుని మరిన్ని అంచనాలు పెంచుతారని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాలన్నీటికీ ఓ పెద్ద సమస్య వచ్చింది. అదే ఆయా చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గిస్తోంది. ఆ విషయంలో మేం వారిలా ఉండకూడదు అనుకుంటున్నాము అని ఈ నిర్మాతలు అనుకుంటున్నారని టాక్. ఇంతకీ అదేంటీ అంటారా.. టికెట్ రేట్స్..
ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతమంది చూసినా.. పెంచిన టికెట్ ధరలను చూసి మాత్రం చాలా ఫీలయ్యారు. అది మోస్ట్ అవెయిటెడ్ సినిమా కాబట్టి బలవంతంగా అయినా చూశారు. కానీ రిపీట్ ఆడియన్స్ పర్సెంటేజ్ ఒకటి కూడా ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఆచార్యతో పాటు లేటెస్ట్ గా వచ్చిన సర్కారువారి పాటకు కూడా పెంచిన టికెట్ రేట్లు పెద్ద మైనస్ గా మారాయి. ఆచార్యకైతే టాక్ తెలియగానే అంత డబ్బులు ఎందుకు దండగా అనేసుకున్నారు. అదే పాత రేట్లు ఉంటే ఖచ్చితంగా ఓ సారి చూద్దాం.. బాస్ సినిమా కదా అనుకునేవాళ్లు. సర్కారువారి పాట పరిస్థితీ దాదాపు అంతే. ఇలా చేయడం వల్ల జనం థియేటర్స్ కు రావడం మానేస్తున్నారు. దీంతో సినిమా పరిశ్రమకే ఇబ్బంది అనేది వారు గుర్తించడం లేదు.

అయితే టికెట్ ధరలు పెంచకుండానే ఎఫ్3ని జనానికి చూపించాలనుకుంటున్నారట నిర్మాతలు. ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు కానీ.. ఈ నిర్ణయం తీసుకోవాలనే అనుకుంటున్నారట. అదే నిజమైతే ఖచ్చితంగా ఎఫ్3కి మేలే జరుగుతుంది కానీ ఇబ్బందేం ఉండదు. పైగా సమ్మర్ ఎండింగ్లో వస్తోంది. అప్పటికి టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి.. అన్ని క్లాస్ ల ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారు. కాదూ వీళ్లూరేట్లు పెంచారా ఇంక అంతే..

Related Posts