ఉన్నాను.. విన్నాను అన్న మహేష పరిస్థితి ఏంటీ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. నాలుగైదేళ్లుగా ఏం పట్టుకున్నా బ్లాక్ బస్టరే అంటూ ఆ మధ్య చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సర్కారువారి పాట కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఈ సినిమాకు కూడా ఆచార్య లాగా మరీ పెద్ద బజ్ ఏం రాలేదు. రిలీజ్ కు ముందు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. అందుకు ప్రధాన కారణం.. వీళ్లుమెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాదని.. డిజిటల్ మీడియంలో ప్రమోషన్స్ ఎక్కువగా చేయడమే. ఓ యూ ట్యూబ్ లో ఇంటర్వ్యూ చూసేంతగా ఇంక రూరల్, అర్బన్ ఆడియన్స్ పెరగలేదు అనేది నిజం.అయినా మహేష్ లాంటి క్లాస్ హీరో సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లోఓ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లే కొంత వరకూ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ ఓపెనింగ్స్ సినిమాను నిలబెడతాయా అనేది కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. మరి ఆ కంటెంట్ ఎలా ఉందంటే మాత్రం ఖచ్చితంగా బావుంది అని చెప్పలేం అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

నిజంగా చెబితే.. సర్కారువారి పాట ఓ అద్భుతమైన పాయింట్. కాంటెంపరరీ ఇష్యూ. ప్రతి మనిషికీ కనెక్ట్ అయ్యే పాయింట్. దీనికి సోషల్ కాజ్ ను యాడ్ చేస్తూ ఓ బలమైన సందేశాన్ని ఇవ్వొచ్చు. ఆ క్రమంలో మొదటి భాగంలో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల సెకండ్ పార్ట్ కు వచ్చే సరికి ఆ సీరియస్ పాయింట్ కాస్తా దారి తప్పింది. దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెబితే.. కనెక్ట్ అయ్యే పాయింట్ నే బలంగా రాసుకోలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో చాలా మిస్టేక్స్ చేయడం వల్ల ఈ కనెక్షన్ మిస్ అయిందని చెప్పొచ్చు. దీనికి తోడు విలన్ క్యారెక్టరైజేషన్ ఎఫెక్టివ్ గా లేదు. బ్యాంక్ లకు రుణాలు ఎగ్గొట్టే వైట్ కాలర్ నేరస్తుల్లానే కామన్ పీపుల్ కూడా ఉండాలంటే ఆ వైట్ కాలర్ నేరస్తుడి పాత్రను ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సి ఉంది. దీనికి సముద్రఖని రేంజ్ కూడా సరిపోలేదనే చెప్పాలి.

మొత్తంగా ఇలాంటి పాయింట్స్ తో శంకర్, ఏఆర్ మురుగదాస్ వంటి వారు సినిమాలు చేస్తే ఖచ్చితంగా దాని ప్రయోజనం మరింతగా కనిపిస్తుంది. ఆ అవకాశాన్ని పరశురామ్ చేజేతులా వదులుకున్నాడనే చెప్పాలి. అలాగని సినిమా మరీ బాలేదు అని కాదు. దర్శకుడు చెప్పాలనుకున్న అసలు పాయింటే వీక్ అయింది. అది సెకండ్ హాఫ్ లోనే రావడంతో సినిమాకు మైనస్ అవుతుంది. ఏదేమైనా ఈ వీకెండ్ వరకూ సినిమాల నిలబడుతుందన్న గ్యారెంటీ లేదనేది ట్రేడ్ టాక్.

Related Posts