విజయ్‌ వల్లే డ్యామేజ్‌ జరిగిందన్న సీనియర్‌ డైరక్టర్‌

ఒక సినిమా సక్సెస్‌ అయితే, ఎందుకు సక్సెస్‌ అయిందో ఔత్సాహికులందరూ అనలైజ్‌ చేస్తుంటారు. అదే ఫెయిల్యూర్‌ అయితే ఎందుకు ఓటమిని చవిచూసిందో అనుభవజ్ఞులు తలా ఒక మాట చెబుతుంటారు. ఇప్పుడు లైగర్‌ విషయంలోనూ ఎవరికి తోచిన విషయాలను వారు చెబుతూనే ఉన్నారు. లేటెస్ట్ గా లైగర్‌ ఫెయిల్యూర్‌ గురించి రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడారు. ఆయన చెప్పిన సంగతులు విన్నవారందరూ… అదేంటి? వర్మ ఇలా అనేశారు అని అనుకునేలా ఉన్నాయి వర్మ మాటలు.


వర్మ కాంపౌండ్‌కీ, పూరి జగన్నాథ్‌కీ స్ట్రాంగ్‌ రిలేషన్‌ ఉంటుంది. వర్మ, పూరి ఫ్రెండ్‌షిప్‌ గురించి ఇండస్ట్రీలో తెలియనివారు ఉండరేమో. అలాంటిది పూరి డైరక్ట్ చేసిన లైగర్‌ గురించి వర్మ ఏం చెబుతారోననే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. అలా ఉండబట్టే, ఇప్పుడు వర్మ చెప్పిన మాట వైరల్‌ అవుతోంది.


లైగర్‌ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ అగ్రెసివ్‌ యాటిట్యూడ్‌ నార్త్ జనాలకు నచ్చలేదన్నది వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌. ఆల్రెడీ బాలీవుడ్‌ హీరోలు అలాంటి యాటిట్యూడ్‌తోనే ఉంటారు. అలాంటివారిని చూసీ చూసీ వెక్స్ అయిపోయారు నార్త్ జనాలు. దానికి తోడు రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సౌత్‌ హీరోలందరూ చాలా డౌన్‌ టు ఎర్త్ ఉంటున్నారు. ప్రతి విషయంలోనూ హంబుల్‌గా ప్రవర్తిస్తున్నారు.

సౌత్‌ వాళ్లంటే ఎక్కడా ఈగోలకు పోరు. చాలా డౌన్‌ టు ఎర్త్ పర్సన్స్ అనే అభిప్రాయానికి వచ్చేశారు హిందీ జనాలు. అలాంటప్పుడు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ యాటిట్యూడ్‌లను చూసిన వాళ్లకి, ఒక్కసారిగా విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ మింగుడుపడలేదు. బాయ్‌కాట్‌ లైగర్‌ ట్రెండ్‌కి కావాల్సినంత మెటీరియల్‌ని లైగర్‌ ఇచ్చినట్టయింది అని చెప్పారు వర్మ. అంతే కాదు, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాక, కరణ్‌ ఏ సినిమా చేసినా సరే, బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ పరిపాటి అయిందని గుర్తుచేశారు.

Related Posts