ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ

రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
తారాగణం : సుధీర్ బాబు, కృతిశెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, అవసరాల శ్రీనివాస్
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : పి.జి విందా
నిర్మాతలు : మహేంద్ర బాబు, కిరణ్‌ బొల్లపల్లి
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ

దర్శకుడుగా ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ స్టైల్ ఉంది. సెన్సిబుల్ మూవీస్ తోనే ఎక్కువగా ఎంటర్టైన్ చేయాలని చూస్తాడు.హెవీ డోస్ కనిపించదు. కొన్నిసార్లు చిన్న పాయింట్ చుట్టూనే కథనం నడిపేస్తాడు. అయినా ఆకట్టుకుంటాడు.అతని రీసెంట్ మూవీ వి ఓటిటిలోనే ఫ్లాప్ అనిపించుకుంది. ఇక తన సమ్మోహనం హీరో వి తర్వాత మళ్లీ ఆ సినిమా గుర్తొచ్చేలా ఈసారి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వచ్చాడు. మరి ఆ అమ్మాయి ఎవరు.. ఆమె గురించి ఏం చెప్పారు అనేది చూద్దాం..

కథ :
నవీన్(సుధీర్ బాబు) బ్లాక్ బస్టర్ డైరెక్టర్. వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో జోష్ లో ఉంటాడు. అయితే అవన్నీ రొటీన్ రొడ్డకొట్టుడు కమర్షియల్ సినిమాలే. అయినా తను అలాంటివే తీస్తూ సక్సెస్ కొట్టాలనుకుంటాడు. అలేఖ్య(కృతిశెట్టి) డాక్టర్. తనకూ తన ఫ్యామిలీకి సినిమా అన్నా.. సినిమా వాళ్లన్నా ఓ రకమైన అసహ్యం. అలాంటి అలేఖ్య నటించిన ఓ ఫిల్మ్ రీల్ బాక్స్ నవీన్ కు దొరుకుతుంది. అప్పటి వరకూ కమర్షియల్ సినిమాలు తీసిన అతను ఈ అమ్మాయితో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా తీయాలనుకుంటాడు. పైగా ఆ అమ్మాయినే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటాడు. మరి సినిమాలంటే ఇష్టం లేని తను నవీన్ డైరెక్షన్ లోనటించేందుకు ఒప్పుకుంటుందా.. అసలు తను ఆ వీడియో ఎలా చేసింది. అంతకు ముందు తనకు సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉందా..? నవీన్, అలేఖ్య మధ్య రిలేషన్ ఎంత వరకూ వెళ్లింది అనేది మిగతా కథ.

విశ్లేషణ :
కొన్ని కథలను ముందే ఊహించేయొచ్చు. అయినా ఊహలను దాటుకుని కాస్త వినోదం పంచే అవకాశం దర్శకులకు ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాలో బానే వాడుకున్నాడు. కానీ ప్రధాన కథ విషయంలోనే పక్కాగా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. �