‘కన్నప్ప‘ సెట్స్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న డివోషనల్ మూవీ ‘కన్నప్ప’. అసలు రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడైన ప్రభాసే.. ‘కన్నప్ప’ రీమేక్ లో నటించాల్సి ఉంది. ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో అది కుదరలేదు. మంచు విష్ణు మాత్రం ‘కన్నప్ప’ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ సినిమాని అభిమానించిన వారికోసం ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్ ను కూడా తీసుకొచ్చాడు.

లేటెస్ట్ గా ప్రభాస్ ‘కన్నప్ప‘ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ప్రభాస్ జాయిన్స్ షూట్ అని చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ప్రభాస్ కాలు మాత్రమే కనిపిస్తోన్న ఈ పోస్టర్ వైవిధ్యంగా ఆకట్టుకుంటోంది. ఇక.. ‘కన్నప్ప‘ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఆ రోల్ ని ఆల్రెడీ అక్షయ్ కుమార్ చేసేశాడు. మరి.. ‘కన్నప్ప‘లో ప్రభాస్ చేయబోయే పాత్ర ఏంటి? అనేదే ఇప్పుడు రెబెల్ ఫ్యాన్స్ కు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది.

Related Posts