నేను నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాస్ – దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డెైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి సినీ ప్రపంచానికి తెలుసు. ఛత్రపతి సినిమాతో వారి స్నేహం మొదలైంది. బాహుబలి రెండు భాగాల చిత్రాలతో ఈ ఇద్దరు మిత్రులు ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్నారు. ప్రతి సందర్భంలో ఒకరి కోసం మరొకరు అనేంత స్నేహ భావాన్ని చూపిస్తారు ప్రభాస్, రాజమౌళి. ఈ దిగ్ధర్శకుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల రివార్డులతో పాటు అవార్డులూ అందుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ పురస్కారాలు దక్కాయి. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్.

గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ తో పాటు, లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ విశెస్ కు స్పందించిన రాజమౌళి…థాంక్స్ డార్లింగ్. నేను ఇంత పేరు తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వు. అంటూ రిప్లై ఇచ్చారు.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

7 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

9 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

9 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

10 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

10 hours ago