‘ఆపరేషన్ వాలెంటైన్‘ ఫైనల్ స్ట్రైక్ అదిరింది.. ఏం జరిగినా సరే చూసుకుందాం..

‘ఎఫ్ 3’ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ‘గాండీవధారి అర్జున’ ఏమాత్రం అలరించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు వరుణ్ తన ఆశలన్నీ ‘ఆపరేషన్ వాలెంటైన్’పైనే పెట్టుకున్నాడు. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ గా ఈ చిత్రాన్ని రాజస్థాన్ బేస్డ్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించాడు. ఈ మూవీలో వరుణ్ కి జోడీగా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ నటించగా.. కీలక పాత్రలో రుహాని శర్మ నటించింది. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్‘ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకాబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫైనల్ స్ట్రైక్ పేరుతో తెలుగు ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, హిందీ ట్రైలర్ ను కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

‘ఆపరేషన్ వాలెంటైన్‘ ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఎటాక్ యావత్ భారతదేశాన్ని ఎంతగానో కలవరపెట్టింది. ఈ ఎటాక్ లో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామాకి కౌంటర్ గా ఇండియన్ ఆర్మీ చేపట్టిన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇతివృత్తంతో ‘ఆపరేషన్ వాలెంటైన్‘ సినిమా రూపొందింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ అయితే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తోంది.

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ డైనమిక్ గా కనిపిస్తున్నాడు. మరో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రోల్ లో మానుషీ చిల్లార్ సరిగ్గా సూటయ్యింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ కూడా ఆకట్టుకునే రీతిలో ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మొత్తంమీద.. ఇప్పటివరకూ తెలుగు స్క్రీన్ పై చూడని ఏరియల్ యాక్షన్ తో విజువల్ ట్రీట్ అందించడానికి ‘ఆపరేషన్ వాలెంటైన్‘తో వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. మరి.. మార్చి 1న విడుదలకాబోతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్‘ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts