Santhosh : కుర్రాడికి మరో ఫ్లాప్ పడినట్టేనా..?

అదేంటో కానీ కొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రాదు.పైగా ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేవారు కూడా ఉంటారు. డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో అతని సినిమా ఆడాలని ఏదో రకంగా సాయం చేస్తుంటారు. ఇన్ని ఉన్నా.. ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్న కుర్రాడు సంతోష్ శోభన్.

ఇన్నాళ్లలో ఏక్ మినీ కథ మాత్రమే హిట్ అనిపించుకుంది. అలాగని అదేం బ్లాక్ బస్టర్ కాదు. జస్ట్ హిట్. ఇక మిగతావన్నీ ఫ్లాపులే. చిత్రం ఏంటంటే.. ఇతను చాల వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ వేగంలో కథ గురించి మర్చిపోతున్నాడని వేరే చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు, దర్శకుడో, బ్యానర్ నో నమ్మి మోసపోతున్నాడేమో అనిపిస్తుంద.

ముఖ్యంగా లేటెస్ట్ గా వచ్చిన అన్ని మంచి శకునములే సినిమా విషయంలో అతను డైరెక్టర్ నందిని రెడ్డి, బ్యానర్ ను బ్లైండ్ గా ఫాలో అయిపోయాడు. పైగా భారీ ప్యాడింగ్ కూడా ఉందీ సినిమాలో. ఇన్ని ఉన్నా.. సరైన కంటెంట్ మాత్రం కనిపించలేదు. దీంతో అన్నీ మంచి శకునములే కాస్ట్ లీ మిస్ ఫైర్ అనిపించుకుంది.
అన్ని మంచి శకునములే గొప్ప కథ కాదు. ఏళ్ల తరబడి వెండితెరపై అరిగిపోయిన అదే కథ.

రెండు కుటుంబాలు.. ఆ కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలు. పెద్దవాళ్లకు పడదు. చిన్నవాళ్లు ప్రేమలో పడతారు. పెద్దాళ్లను ఎదురించకూడదు. అలాగని ప్రేమను వదలుకోకూడదు. ఇదే ఫార్మాట్లో వచ్చిందీ సినిమా. అయితే ఈ తరహా కథలు ఎన్ని వచ్చినా.. బలమైన ఎమోషన్స్ ను క్యారీ చేసేలా స్టోరీ అనే థ్రెడ్ ఉంటే వర్కవుట్ అవుతుంది. ఈ సినిమాలో ఆ కథే మిస్ అయింది.

నందిని రెడ్డి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఉంటాయి. అందుకే మరింతగా వారిని ఆకట్టుకునేందుకు చిన్న పాత్రల్లో కూడా పెద్ద నటులను తీసుకుంది. కానీ ఆ పాత్రలకు ఓ ఔచిత్యం(క్యారెక్టరైజేషన్) ఉండాలనే మినిమం పాయింట్ ను వదిలేసింది. అదీ కాక ఆ సీనియర్స్ కూడా ఇలాంటి పాత్రలుఇప్పటికే ఎన్నో చేశారు. అంచేత అదీ కొత్తగా అనిపించదు.

ఇక స్క్రీన్ ప్లేలో ఏవైనా మెరుపులు ఉన్నాయా అంటే అదీ లేదు. దీనికి తోడు మళయాల సినిమాలకు పోటీ ఇచ్చేలా అత్యంత స్లోగా సాగే నెరేషన్. ఈ ల్యాగ్ వల్లే ఆడియన్స్ అక్కడక్కడా కొన్ని మంచి సీన్స్ ఉన్నా.. అందులో ఇన్వాల్వ్ కాలేకపోయాడు అనేది నిజం. ఇక ఈ మొత్తంలో ఎక్కువగా లాస్ అయింది ఎవరూ అంటే సంతోష్‌ శోభన్.

అతని వరకూ అతను బాగా నటించాడు. ఎంటర్టైన్మెంట్ నుంచి ఎమోషనల్ సీన్స్ వరకూ మెచ్యూర్డ్ గా, సిన్సియర్ గా నటించాడు. కానీ కథలో బలం లేనప్పుడు ఈ బలాలు సినిమాను నిలబెట్టలేవు. అలాగని ఇది మరీ డిజాస్టరస్ సినిమా అనలేం. అలాగని హిట్ అని కూడా చెప్పలేం. బట్.. సంతోష్‌ ఎక్స్ పెక్ట్ చేస్తోన్న రిజల్ట్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా ఇవ్వదు. అది మాత్రం క్లియర్ చెప్పొచ్చు.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

14 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

16 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

16 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

17 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

17 hours ago