తేజ సజ్జా బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్‌ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజు స్పెషల్ గా.. తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్,  టాప్గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు – అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.

తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్  తదితరులు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం:- ప్రశాంత్ వర్మ

నిర్మాత:- కె నిరంజన్ రెడ్డి

బ్యానర్:- ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

మర్పణ:- శ్రీమతి చైతన్య

స్క్రీన్‌ప్లే:- స్క్రిప్ట్స్‌విల్లే

డీవోపీ:- దాశరధి శివేంద్ర

సంగీత దర్శకులు:- అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్,  కృష్ణ సౌరభ్

ఎడిటర్:- ఎస్బీ రాజు తలారి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:- అస్రిన్ రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్:- వెంకట్ కుమార్ జెట్టి

అసోసియేట్ ప్రొడ్యూసర్:- కుశాల్ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్:- శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో :- వంశీ-శేఖర్

కాస్ట్యూమ్ డిజైనర్:- లంకా సంతోషి

Telugu 70mm

Recent Posts

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

22 mins ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

32 mins ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

3 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

4 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

6 hours ago

‘బ్రహ్మ ఆనందం‘.. తాత మనవళ్లుగా మారిన తండ్రీకొడుకులు

పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…

6 hours ago