ప్రెస్ మీట్లో రాజమౌళిని ఆడుకున్న తారక్ – చరణ్

రాజమౌళి అంటే ఓ సినిమాను చెక్కడలో ఎక్స్ పర్ట్. అందుకే ఆయనకు జక్కన్న అనే పేరు పెట్టారు ఆయన సినిమాల్లో నటించినవాళ్లు. ముఖ్యంగా ఈ పేరు రావడానికి కారనం రాజీవ్ కనకాల అనేది అందరికీ తెలుసు. స్టూడెంట్ నంబర్ వన్ నుంచి అతను రాజమౌళి సినిమాల్లో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. అప్పటికే ఎన్టీఆర్ తో స్నేహం కూడా ఉండటంతో అంతా కలిసి రాజమౌళిని జక్కన్న చేశారు. ఇదే విషయమై బెంగళూరు ప్రెస్ మీట్లో చరణ్ తారక్ కలిసి రాజమౌళిని మీడియా ముందే ఓ ఆట ఆడేసుకున్నారు.
ఈ గురువారం విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. దీంతో ఆ ట్రైలర్ ను లీడ్ గా పెట్టుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేసిందీ మూవీ టీమ్. ఈ నేపథ్యంలో శుక్రవారం బెంగళూరు వెళ్లారు. అలియా భట్ కూడా ఈ ప్రమోషనల్ ఈవెంట్ కు ఎటెండ్ అయింది. అయితే ప్రెస్ మీట్ లో ఒక మహిళ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి అడిగింది. దీంతో ఇద్దరు హీరోలూ చెలరేగిపోయారు.
‘రాజమౌళితో వర్క్ టార్చరస్ అంటూ ఎన్టీఆర్ ఆవేశంగా చెప్పుకుపోయాడు. అటు చరణ్ మాత్రం కూల్ గా మా దుంప తెంచేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే వీరు నాటు నాటు పాట గురించి చెప్పారు. ఈ పాటను ఇండియాలోనే 18రోజులు ప్రాక్టీస్ చేశారట. అయినా చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లినప్పుడు కూడా మళ్లీ ప్రాక్టీస్ చేయమని చెప్పాడట. రోజుకు ఐదారు గంటల పాటు ప్రాక్టీస్ చేశారుట. రామ్ చరణ్ చెబుతూ.. డ్యాన్స్ లో తారక్ కు ఓ స్టైల్ ఉంది.. నాకో స్టైల్ ఉంది. కానీ మీ ఇద్దరి స్టైల్స్ ను పక్కన బెట్టి రాజమౌళి స్టైల్ లో చేయమని చెప్పాడట. రాజమౌళి తన స్టైల్ గురించి చెప్పకపోయినా మేం అలా అనుకున్నామని తారక్ అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. అలియా మాత్రం తనకు కూల్ గా ఉందని చెప్పింది. దీనికి తారక్ మాత్రం అవున్లే నువ్వు నాటు నాటు పాట చేసి ఉంటే తెలిసేది అని సెటైర్ వేశాడు.
అంతా విన్న తర్వాత రాజమౌళి మైక్ తీసుకుని ఎప్పుడైనా మీపై అరిచానా.. ఫ్రస్ట్రేషన్ చూపించానా అని అడిగాడు. దీనికి లేదు అని చెబుతూనే.. ఒన్ మోర్ టేక్ అనడమే ఫ్రస్ట్రేషన్ కదా అంటూ ఫన్నీగా చెప్పాడు ఎన్టీఆర్. మొత్తంగా బెంగళూరు ప్రమోషన్స్ మంచి జోష్ గా సాగాయనే చెప్పాలి.

Telugu 70mm

Recent Posts

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

15 mins ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

2 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

3 hours ago

బుల్లితెర నటుడు చందు జీవితంలో మరో కోణం

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సీరియల్ నటి పవిత్ర కార్ యాక్సిడెంట్ లో మరణించడం వలనే చందు…

3 hours ago

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి…

12 hours ago

‘Devara’.. ‘Fear Song’ promo is here

After the blockbuster like 'Janatha Garage', the film 'Devara' is being made in the combination…

12 hours ago