‘యానిమల్‘ ట్రైలర్.. రణ్ బీర్ రస్టిక్ విజువల్ ట్రీట్..

హీరో యారగెంట్ క్యారెక్టరైజేషన్ తో ‘అర్జున్ రెడ్డి‘తో సందీప్ రెడ్డి వంగా సృష్టించిన సంచలన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత అదే సినిమాని ‘కబీర్ సింగ్‘గా హిందీలో రీమేక్ చేసి.. అక్కడా ఘన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ముచ్చటగా తన మూడో సినిమా ‘యానిమల్‘తో మరిన్ని సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈసారి తనకు టాలెంట్ పుష్కలంగా ఉన్న రణ్ బీర్ కపూర్ దొరికాడు. ఇక.. వెండితెరపై విజువల్ ట్రీట్ గ్యారంటీ. ఇప్పటికే సాంగ్స్, టీజర్ తో ‘యానిమల్‘పై అంచనాలు ఆకాశాన్నంటగా.. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ తో బాక్సాఫీస్ బొనాంజ ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘యానిమల్‘ తెరకెక్కింది. కొడుకుగా రణ్ బీర్, తండ్రిగా అనిల్ కపూర్ బాండింగ్ హైలైట్ గా ఈ సినిమా రాబోతుంది. ట్రైలర్ లో కొడుకుగా, లవర్ బాయ్ గా, గ్యాంగ్ స్టర్ గా రణ్ బీర్ క్యారెక్టర్ లో డిఫరెంట్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ప్రతీ ఫ్రేమ్ విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది. రణ్ బీర్, రష్మిక లవ్ ట్రాక్, ఎమోషన్స్ కూడా మరో లెవెల్ లో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక.. హీరో రణ్ బీర్, విలన్ బాబీ డియోల్ ఎపిసోడ్స్ కూడా సినిమాకి హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. కేవలం హిందీలోనే కాదు.. సందీప్ రెడ్డి వంగా ఇమేజ్ తో తెలుగులోనూ ‘యానిమల్‘కి మంచి డిమాండ్ ఉంది. మొత్తంమీద.. డిసెంబర్ 1న రాబోతున్న ‘యానిమల్‘ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయం.

Related Posts