మరోసారి పేరు మార్చుకున్న సుప్రీమ్ హీరో

మేనమామల అండదండలతో అనతి కాలంలోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సాయిధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి తొలి నాళ్లలో సంపాదించుకున్న సుప్రీమ్ హీరో ట్యాగ్ ను సాయిధరమ్ తేజ్ అందిపుచ్చుకున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష, బ్రో’ వంటి రెండు మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్.. ‘సత్య’ అనే కాన్సెప్ట్ ఫిలింలో నటించాడు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకున్న ‘సత్య’ కాన్సెప్ట్ ఫిలింను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

లేటెస్ట్ గా ‘సత్య’ స్పెషల్ స్క్రీనింగ్ కి అటెండ్ అయ్యాడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా తన పేరులో కొత్త మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించాడు. తొలుత సాయిధరమ్ తేజ్ గా ఉన్న తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు. ఇకపై తన పేరులో తల్లి పేరు దుర్గ ను కలుపుకుంటున్నాడు. దీంతో తన పేరు ‘సాయి దుర్గా తేజ్’ అని వివరించాడు సుప్రీమ్ హీరో.

Related Posts