‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ ఆగింది.. ముందుగా టి.వి.లో వచ్చేస్తుంది

సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ సాధించిన ‘హనుమాన్’ చిత్రం ఇప్పటివరకూ ఓటీటీలో రాలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన తెలుగు సినిమాలు, తమిళ చిత్రాలు అన్నీ ఓటీటీలో వచ్చేశాయి.. ఒక్క ‘హనుమాన్‘ తప్ప. ఇక.. తొలుత మార్చి మొదటి వారంలో ఓటీటీలో వస్తుందనుకున్న ‘హనుమాన్’ చిత్రం.. ఆ తర్వాత మహాశివరాత్రి కానుకగా మార్చి 8న స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జరిగింది. అయితే.. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం తమకు ‘హనుమాన్’ స్ట్రీమింగ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదని సోషల్ మీడియాలో తెలిపింది.

ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సస్పెన్స్ కొనసాగుతుండగానే.. హిందీ ఆడియన్స్ కోసం ఓ అదిరిపోయే అప్డేట్ అందించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ మూవీ తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో.. హిందీలోనూ భారీ విజయాన్ని సాధించింది. లేటెస్ట్ గా ‘హనుమాన్’ హిందీ టెలివిజన్ ప్రీమియర్ కి టైమ్ ఫిక్స్ అయ్యింది. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీఫ్లెక్స్, జియో సినిమా లలో ప్రీమియర్ గా ప్రసారమవ్వబోతుంది. ఈ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

Related Posts