ఐటెం సాంగ్స్ కి నో చెబుతున్న శ్రీలీల

హీరోయిన్స్‌ గా టాప్ రేంజుకు చేరుకున్న భామలు.. ఐటెం నంబర్స్‌ చేయడానికి తటపటాయిస్తుంటారు. అయినా.. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రపథాన దూసుకెళ్తున్న సమయంలోనే ఐటెం నంబర్స్ గానూ అలరించారు కాజల్, తమన్నా, సమంత, శ్రుతి హాసన్ వంటి భామలు. ఒకవైపు హీరోయిన్స్ గా నటిస్తూనే.. స్పెషల్ సాంగ్స్ లోనూ మురిపించడానికి ఈ ముద్దుగుమ్మలు ఏమాత్రం మొహమాటం పడలేదు.

అయితే.. ఈ విషయంలో తాను మాత్రం కాస్త విభిన్నం అంటోంది శ్రీలీల. ఈతరంలో డ్యాన్సుల్లో ఇరగదీసే శ్రీలీల.. స్పెషల్ సాంగ్స్ కి మాత్రం నో అంటోందట. ఆమధ్య శ్రీలీలకు ‘పుష్ప 2’లో ఐటెం నంబర్ చేసే ఛాన్స్ వచ్చిందట. అయితే.. ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. లేటెస్ట్ గా మరో బిగ్ ప్రొడక్షన్ నుంచి ఇలాంటి ఆఫరే శ్రీలీల ముందుకు వచ్చిందట. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చేయనని కరాఖండిగా చెప్పేసిందట.

మరోవైపు ఏడాది సమయంలోనే అరడజను సినిమాలను ఆడియన్స్ ముందు నిలిపిన శ్రీలీల చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్కటే సినిమా ఉంది. అది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రం ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అయితే.. మళ్లీ ఈ మూవీ ఎప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళ్తుంది అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం శ్రీలీల సినిమాల నుంచి గ్యాప్ దొరకడంతో తన ఎమ్.బి.బి.ఎస్. చదువును పూర్తిచేసే పనిలో ఉందట.

Related Posts