సందీప్‌కిషన్‌ 30 సినిమా అనౌన్స్‌మెంట్

సందీప్‌కిషన్‌ యంగ్‌ టాలెంటెడ్ హీరో. రీసెంట్ గా ఊరిపేరు భైరవకోనతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కెరీర్‌లో 30 వ సినిమా మైలు రాయికి చేరుకున్నాడు. తన 30 సినిమాని సామజవరగమన, ఊరిపేరు భైరవకోన చిత్రాలతో వరుస హిట్స్ సాధించిన ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌, హాస్య మూవీస్‌ బ్యానర్‌లలో చేస్తున్నాడు. ఈ సినిమా తో ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌కు హ్యాట్రిక్ హిట్ ఇవ్వబోతున్నాడంటున్నారు మేకర్స్‌. ఈ మూవీకి ధమాకాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ ఇచ్చిన నక్కిన త్రినాధరావు డైరెక్షన్‌ చేయబోతున్నారు.
ధమాకాతో నక్కిన త్రినాధరావు, ప్రసన్నకుమార్‌ కాంబో బాగా వర్కవుట్ అయ్యింది.. సందీప్‌ కిషన్‌ 30 వ సినిమాకి కూడా ప్రసన్న కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.


సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు, ఇది గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

Related Posts