శ్రీకాంత్, జె.డి. ‘వన్ బై టు’కి 30 ఏళ్లు

శ్రీకాంత్, జె.డి. చక్రవర్తి హీరోలుగా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘వన్ బై టు’. అప్పటివరకూ వరుసగా విలన్ పాత్రలతో దూసుకెళ్తున్న శ్రీకాంత్ ని హీరోగా మార్చిన చిత్రమిది. అలాగే జె.డి. చక్రవర్తికి కూడా కథానాయకుడిగా మంచి గుర్తింపుని ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో నిరోషా కథానాయికగా నటించగా.. సూర్యకాంతం, నగేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

‘వన్ బై టు’ సినిమా డిసెంబర్ 10, 1993న విడుదలైంది. నేటితో (డిసెంబర్ 10, 2023) ఈ మూవీ రిలీజై 30 ఏళ్లయ్యింది. తాజాగా ఈ సినిమా థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది టీమ్. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీకాంత్, జె.డి. లతో పాటు.. నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి, శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Related Posts