‘డెవిల్’కి హైలైట్ గా కళ్యాణ్ రామ్ కాస్ట్యూమ్స్

వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచడంలో ముందుంటాడు కళ్యాణ్ రామ్. ఈకోవలోనే డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. బ్రిటీష్ వారు ఇండియాని పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది. అభిషేక్ నామా దర్శకనిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గూఢచారిగా కనిపించబోతున్నాడు.

బ్రిటీష్ ఇండియా కాలానికి సంబంధించిన గూఢచారి కావడంతో కళ్యాణ్ రామ్ లుక్ ను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ధోతి కట్టుకుని.. పైన ఒక వెయిస్ట్‌ కోటుని ధ‌రించి కనిపించనున్నాడు. ఇక.. ఈ మూవీకోసం కళ్యాణ్ రామ్ ఏకంగా 90 కాస్ట్యూమ్స్‌ ను ఉపయోగించాడట.

ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊల్‌ తో 60 బ్లేజ‌ర్స్‌ ను ప్ర‌త్యేకంగా కళ్యాణ్ రామ్ కోసం రూపొందించారట. ఆ బ్లేజర్ జేబు ప‌క్క‌న వేలాడుతూ ఉండే ఓ హ్యాంగింగ్ వాచ్‌ ను పురాతన వాచీలను సేకరించే ఓ వ్యక్తి నుంచి సేకరించారట. కళ్యాణ్ రామ్ తో గతంలో ఐదు సినిమాలకు పనిచేసిన రాజేష్ ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్. కళ్యాణ్ రామ్ కి జోడీగా సంయుక్త మీనన్ నటించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts