HomeLatest'అఖండ' లుక్ లో అదరగొట్టిన SKN

‘అఖండ’ లుక్ లో అదరగొట్టిన SKN

-

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి గీతా ఆర్ట్స్ అండదండలతో నిర్మాతగా మారిన SKN ‘బేబి’తో కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ‘బేబి’ సినిమా SKN ని అగ్ర నిర్మాతగా నిలబెట్టింది. ప్రస్తుతం తన సినిమాల లైనప్ భారీగా ఉంది. కాసేపు SKN నిర్మించే చిత్రాల గురించి పక్కనపెడితే.. SKN స్పీచ్ లకు కూడా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీమ్స్ రూపంలో SKN స్పీచ్ లు బాగా వైరల్ అవుతాయి.

లేటెస్ట్ గా ‘గామి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో SKN స్పీచ్ హైలైట్ అయ్యింది. ఈ ఈవెంట్ లో తన స్పీచ్ తో మాత్రమే కాదు.. అతని ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ‘అఖండ’లో బాలయ్య స్టైల్ లో.. SKN మెడలో ఓ కండువా వేసుకొని, ఓ రుద్రాక్ష మాల వేసుకొని, రెండు చేతులకు తాళ్లు కట్టుకొని, విభూది బొట్టు పెట్టుకొని ‘గామి’ ఈవెంట్ కి హాజరయ్యాడు.

ఇక ఈ ఈవెంట్లో SKN స్పీచ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. ‘హాలీవుడ్ లో ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాలు తీస్తున్నారు, మనమేమో ఇంట్లో సెల్లార్ లో తీసేస్తున్నాం. అలాంటప్పుడు ‘గామి’ సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడే ఎంకరేజ్ చేయాలి. ఆరు నెలలు సినిమా లేట్ అయితేనే కష్టం అనుకున్న వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో ఒక సినిమా కోసం 5 ఏళ్ళు టైమ్ ఇవ్వడం అంటే విశ్వక్ నిజంగా గ్రేట్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మన డివోషన్, ట్రెడిషన్ కూడా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అంటూ చిత్రబృందానికి విషెస్ తెలిపాడు SKN.

ఇవీ చదవండి

English News