శేఖర్ కమ్ముల స్పెషల్ మేకింగ్ వీడియో

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. హృద్యమైన కథలను అంతే హృద్యంగా వెండితెరపై ఆవిష్కరిస్తుంటాడు. ఇతని సినిమాలలో మాస్, యాక్షన్ అనే పదాలకు పెద్దగా చోటు ఉండదు. అందుకే.. శేఖర్ కమ్ములను అందరూ క్లాస్ డైరెక్టర్ గా పిలుస్తంటారు. అయితే.. ఈసారి తన మార్క్ క్లాస్ ఎలిమెంట్స్ తో పాటు.. మాస్ అంశాలను కూడా పుష్కలంగా చూపిస్తూ.. నాగార్జున-ధనుష్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

‘డి.ఎన్.ఎస్‘ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘డి.ఎన్.ఎస్‘ అంటే ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల అని అర్థం. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకుంటోంది. ఇక.. ఈరోజు (ఫిబ్రవరి 4) శేఖర్ కమ్ముల పుట్టినరోజు సందర్భంగా ‘డి.ఎన్.ఎస్‘ నుంచి స్పెషల్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది టీమ్.

Related Posts