యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కి బర్త్ డే విషెస్

మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా కొనసాగుతున్న అతి కొద్ది మందిలో డాక్టర్ రాజశేఖర్ ఒకరు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసిన ఈ సీనియర్ హీరో పుట్టినరోజు ఈరోజు (ఫిబ్రవరి 4).

Telugu Film Actors, Smt. Jeevitha and Dr. Rajashekhar calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on October 26, 2015.

టి.కృష్ణ దర్శకత్వం వహించిన ‘ప్రతిఘటన, వందేమాతరం’ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓనమాలు నేర్చుకున్న రాజశేఖర్.. ఆ తర్వాత ‘అంకుశం, మగాడు, ఆగ్రహం’ వంటి సినిమాలతో.. యంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఫిరోషియస్ పోలీస్ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన రాజశేఖర్.. ‘శివన్న, మా అన్నయ్య, సింహరాశి’ వంటి చిత్రాల్లోని ధీరోదాత్త పాత్రలతో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇక.. ‘శ్రుతిలయలు’ వంటి సంగీత ప్రధాన చిత్రంలోనూ.. ‘అల్లరిప్రియుడు’ వంటి రొమాంటిక్ సినిమాలోనూ కథానాయకుడిగా మెప్పించిన ఘనత రాజశేఖర్ ది.

పదేళ్ల పాటు సక్సెస్ లకు దూరమైన రాజశేఖర్.. 2017లో విడుదలైన ‘గరుడ వేగ’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ తర్వాత ‘కల్కి‘తో ఫర్వాలేదనిపించినా.. మళ్లీ ఇప్పుడు రాజశేఖర్ కి మంచి విజయం కావాలి. మరోవైపు నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘తో క్యారెక్టర్ గా యాక్టర్ గానూ రంగంలోకి దిగిన రాజశేఖర్.. మునుముందు మరిన్ని మంచి పాత్రలతో అలరించాలని ఆశిస్తూ మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts