కృష్ణంరాజు గారి మృతికి సత్యనారాయణ గారి సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు.

అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది విని పక్కనే కూర్చున్న అల్లు రామలింగయ్యతో ‘ఏమయ్యా లింగయ్య.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా ? ఎవరో గానీ, అన్న గారిలా బాగా రౌద్రంగా చెబుతున్నారు.. ఎవరు ?’ అని ఆతృతగా అడిగితే సొంత డబ్బింగ్ అని చెప్పారు.

అది విని ఆశ్చర్యపోయాను, సినిమా అయిపోయాక వెంటనే ఆయనను కలిసి ‘ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగులు చెబుతున్నావ్.. నువ్వు మరిన్ని చిత్రాల్లో నటించాలి’ అని అంటే.. ఆ మాటకు ఆయన నవ్వుతూ.. ‘అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా ?’ అంటూ నవ్వేశారు. అలా మొదలైన మా పరిచయం మారణ హోమం, ప్రేమ తరంగాలు, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యేలా చేసింది. ఆయన లాంటి నటుడిని దూరం చేసుకుని కళామ తల్లి బాధపడుతుంది. ఆయన కన్నుమూయడం తెలుగు సినీ జగత్తుకే కాదు మా అందరికీ తీరని లోటు.

Telugu 70mm

Recent Posts

Vikram As The Hero In ‘Veera Dheera Sooran Part-2’

No matter how many heroes we have, there are only a few who have reached…

8 hours ago

Movie Celebrities Who Will Exercise Their Right To Vote Tomorrow

Elections are going to be held in two Telugu states tomorrow (May 13). While elections…

9 hours ago

‘Double Ismart’ Teaser Release Date Fixed

Most Awaiting Movie 'Double Ismart' Starring Energetic Star Ram. This movie is being made as…

9 hours ago

విక్రమ్ హీరోగా ‘వీర ధీర సూరన్.. పార్ట్-2‘

మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్…

9 hours ago

రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్

రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో…

9 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి…

13 hours ago