మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది.ఈరోజు ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను.పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్.
ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే నయనతార ఫస్ట్ లుక్ విడుదలైయింది. సత్యప్రియ జైదేవ్ గా నయనతార ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జైదేవ్ గా సత్యదేవ్ ఫస్ట్ లుక్ కూడా క్యూరియాసిటీని పెంచింది.ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…