కార్తీ సరసన సమంత..?

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తమిళ్ స్టార్ కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. తను కొత్తవారితో చేయడం లేదంటే.. ఆల్రెడీ ఒకటీ రెండు హిట్స్ కొట్టిన దర్శకులతో సినిమాలు చేయడం కార్తీకి మొదటి నుంచి ఉన్న అలవాటు. గతంలో ఇలాంటి దర్శకులతో పనిచేసే పెద్ద విజయాలు అందుకున్నాడు. అట్టకత్తి అనే సినిమాతో విమర్శకులను మెప్పించిన పా రంజిత్ రెండో సినిమాను కార్తీ చేశాడు. మద్రాస్ పేరుతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్. అప్పుడు కార్తీ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు కూడా. రీసెంట్ గా వచ్చిన ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ సైతం అంతకు ముందు మా నగరం అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. అతని రెండో సినిమా చేసి తనూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కార్తీ. ఇప్పుడు అలాంటి మరో దర్శకుడితో సినిమాకు సిద్ధమయ్యాడు.
రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ హీరోగా బ్యాచులర్ అనే సినిమా వచ్చింది. మూవీకి యావరేజ్ అన్న టాకే వచ్చింది. కానీ దర్శకుడు సతీష్ సెల్వరాజ్ కు మంచి పేరు వచ్చింది. అందుకే కార్తీ ఈ సతీష్ కు రెండో ఛాన్స్ ఇచ్చాడు. ఓ రకంగా కార్తీ కూడా ఇప్పుడు మరో సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఖైదీ తర్వాత చేసిన తంబి(తెలుగులో దొంగ) పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే భారీ అంచనాలతో వచ్చిన సుల్తాన్ సైతం మెప్పించలేకపోయింది. అలాగని ఇవి ఫ్లాప్ చిత్రాలు కాదు. బట్ సాలిడ్ హిట్స్ గా నిలవలేదు. అందుకే కార్తీ సతీష్ సెల్వరాజ్ కు అవకాశం ఇచ్చాడు. అంటే అతను చెప్పిన కథ వల్లే అవకాశం వచ్చిందనుకోండి.
ఇక ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ కలిసి నటించలేదు. గతంలో లింగుస్వామి డైరెక్షన్ లో నటించే అవకాశం వచ్చినా ఆ ప్రాజెక్టే ఆగిపోయింది. ఇక సమంత కూడా విడాకులు తర్వాత మళ్లీ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేసేందుకే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా తనకు తమిళ్ లో ఇది మరో ఎంట్రీ అవుతుంది. కాకపోతే తనిప్పుడు చాలా బిజీగా ఉంది. మరి ఈ బిజీలో కార్తీ సినిమాకు డేట్స్ ఇస్తుందా అనేది చెప్పలేం కానీ.. వీళ్లు మాత్రం సమంతనే తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నారట.

Related Posts