సగం మైలురాయిని దాటిన ‘సలార్‘

యాక్షన్ లో వైలెంట్ గా చెలరేగిపోయే ప్రభాస్ ను మరింత వైలెంట్ గా ఆవిష్కరించిన చిత్రం ‘సలార్‘. రెబెల్ స్టార్ నెవర్ బిఫోర్ మేకోవర్ తో విజువల్ ట్రీట్ అందిస్తోన్న ‘సలార్‘ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది. వీకెండ్స్ లోనే కాదు.. వీక్ డేస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఒకప్పుడు 50 రోజులు, 100 రోజులు ఆడే సినిమాలుండేవి. ఆ చిత్రాలు ఎన్ని థియేటర్లలో 50 రోజులు ఆడాయి.. 100 రోజులు ఆడాయి అనేవి రికార్డులుగా చెప్పుకునే వారు ఫ్యాన్స్. ఆ తర్వాత రూ.100 కోట్ల క్లబ్, రూ.200 కోట్ల క్లబ్ అనేవి వచ్చాయి. అయితే.. కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా మూవీస్ కు రూ.1000 కోట్లు వసూళ్లు అనేది బెంచ్ మార్క్ గా మారింది. ఇప్పటికే ‘బాహుబలి 2‘తో ఈ ఫీట్ ను సాధించిన ప్రభాస్.. ‘సలార్‘తోనూ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొడతాడనే నమ్మకం ఉంది. మొత్తంమీద.. వెయ్యి కోట్లు మైలురాయిలో ఇప్పటికే సగభాగాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రభాస్.. మిగతా సగాన్ని త్వరలోనే పూర్తిచేస్తాడేమో చూడాలి.

Related Posts