సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబోలో హ్యాట్రిక్ మూవీ ..?

తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. గ్రేట్ డ్యాన్సర్ గా కూడా ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తోంది. అంత వరకూ బానే ఉంది కానీ.. ఈ సెలెక్షన్ మరీ చాలా టైమ్ తీసుకుంటోంది అనేది ఆమె ఫ్యాన్స్ బాధ. రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకున్న సాయి పల్లవి.. ఆ మూవీ తర్వాత మరో కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. అంతకు ముందు చేసిన విరాటపర్వం మాత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు సాయిపల్లవి ఏం చేయబోతోంది..?
అంటే ఓ కొత్త వార్త వినిపిస్తోంది. సాయి పల్లవికి బాగా నచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అఫ్ కోర్స్ ఆయన మనకూ ఇష్టమే అనుకోండి. ఈ ఇద్దరి కాంబోలో ఫిదా తర్వాత లవ్ స్టోరీ వచ్చింది. ఈ మూవీలో సాయి పల్లవి నటనకు విమర్శలకు నుంచి మరోసారి గ్రేట్ అప్లాజ్ వచ్చింది. అయితే కొన్నాళ్లుగా సాయి పల్లవి నుంచి కొత్త సినిమా అప్డేట్ ఏదీ రావడం లేదు. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ అలాగే ఉంది. అంటే తను ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు అనేది తెలుస్తోంది. అయితే.. తన నుంచి అనౌన్స్ మెంట్ రాలేదు కానీ త్వరలోనే మరోసారి శేఖర్ కమ్ముల సినిమాలో ఓ బలమైన పాత్రతో రాబోతోందనేది లేటెస్ట్ న్యూస్. ఇది కూడా ప్యాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయింది కదా.. ఈ మూవీలో సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ వార్తలు గతంలోనూ వచ్చాయి. కానీ తాజాగా అవి నిజమే అనే న్యూస్ బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ సాయి పల్లవి చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ క్యారెక్టరైజేషన్ ఉండబోతోందంటున్నారు. ఓ రకంగా ఇదో ఛాలెంజింగ్ రోల్. అందుకే ఈ పాత్రకు సంబంధించిన హోమ్ వర్క్ చేస్తోంది సాయి పల్లవి అంటున్నారు.
మరో విశేషం ఏంటంటే.. సాయి పల్లవి, ధనుష్ కాంబోలో గతంలో ఓ తమిళ్ సినిమా వచ్చింది. ఈ మూవీలోని ఓ బేబీ సాంగ్ యూ ట్యూబ్ ను షేక్ చేసింది కదా.. అలాంటి కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది.. అటు సాయి పల్లవి, శేఖర్ కమ్ములది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పెయిర్. సో సినిమాకు ముందే ఓ సూపర్ హిట్ కళ యాడ్ అయిందన్నమాట. మరో విషయం ఏంటంటే.. లవ్ స్టోరీలాగా ఈ చిత్ర కథ కూడా ఓ సామాజిక సమస్య చుట్టూనే తిరుగుతుందట. ఇలాంటి కథలంటే ధనుష్ కూ ఇష్టం కదా.. అందుకే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. మరి శేఖర్ కమ్ముల ఈ సారి సాయి పల్లవిని ఎలా చూపించబోతున్నాడో..

Telugu 70mm

Recent Posts

ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…

25 mins ago

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

5 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…

5 hours ago

థియేటర్ల మూసివేత మా దృష్టికి రాలేదు.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్

ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…

5 hours ago

‘Love Me’ Trailer.. A ghost story coming from Dil Raju’s compound

Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…

5 hours ago

Varun Sandesh’s ‘Ninda’ Based On True Events

Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…

5 hours ago