యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని యావత్ దేశంలో ఉన్న సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రిలీజ్ కి అంతా సెట్ అయ్యింది. ఇక జనవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అనుకుంటుంటే.. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడనుంది అని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం దేశంలో మళ్లీ మారుతున్న పరిస్థితులు రీత్యా ఈ సినిమా వాయిదా పడనుంది అనే వార్త వైరల్ అవుతుంది. ఆల్రెడీ మహారాష్ట్ర లో నైట్ కర్ఫ్యూ విధించారు. అలాగే ఇదే బాటలో మన దక్షిణాదిలో కూడా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిబంధనలు పెట్టేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో ఈ సినిమా రిలీజ్ నాటికి పరిస్థితి ఇలానే ఉంటే వసూళ్ళ పై బాగా ప్రభావం పడుతుంది. అందుచేత ఈ బిగ్ బడ్జెట్ మూవీ వాయిదా పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
ఇలా వార్తలు వస్తున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం నార్త్ లో ఇంకా ప్రచారం చేస్తుంది. హైదారాబాద్ లో డిసెంబర్ 31న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేయాలి అనుకున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదట. అందుచేత డిసెంబర్ 31న హైదరాబాద్ లో చేయాలనుకున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. మరి.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తల పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Rajamouli is the first in the list of directors who have not failed in Telugu.…
Succession is very common in film industry. Almost all the star heroes in the Telugu…
An unexpected update has come from Power Star Pawan Kalyan's first period drama 'Hari Hara…
May 4 is the birth anniversary of director Dasari Narayana Rao. Tollywood celebrates that day…
'Alluri Sitaramaraju' stands in the first row among the films that are said to be…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పీరియడ్ డ్రామా 'హరి హర వీరమల్లు' నుంచి ఊహించని అప్డేట్ వచ్చేసింది. ఈ…