ఆర్ఆర్ఆర్.. బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేస్తుందా.?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్.. అన్ని అడ్డంకులను దాటుకుని జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఆర్ఆర్ఆర్.. బాహుబ‌లి రికార్డులే టార్గెట్ గా బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతోంది. అయితే.. ఆర్ఆర్ఆర్ ఆశించిన స్ధాయిలో క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుందా.? అంటే.. క‌న్ ఫ‌ర్మ్ గా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది.

కార‌ణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఐదు రోజుల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌ కేవలం 6 రోజుల గ్యాప్ లో మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. అంటే ఆర్ఆర్ఆర్ మూవీకి కంప్లీట్ గా థియేటర్లు దొరికేది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆత‌ర్వాత థియేట‌ర్ల‌ను పంచుకోవాలి. తెలుగులోనే కాకుండా త‌మిళ్ లో కూడా ఇదే ప‌రిస్థితి. అక్క‌డ అజిత్ న‌టిస్తోన్న వాలిమై రిలీజ్ కానుంది. ఓవ‌ర్ సీస్ లో కూడా ఇదే ప‌రిస్థితి.

మ‌రో విష‌యం ఏంటంటే.. ఆంధ్రాలో టిక్కెట్ల రేట్లు బాగా త‌క్కువుగా ఉన్నాయి. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఆర్ఆర్ఆర్.. బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేస్తుందా..? అంటే అనుమాన‌మే అనే స‌మాధాన‌మే వినిపిస్తుంది. ఈ ర‌కంగా ఆర్ఆర్ఆర్ కు అగ్నిప‌రీక్షే. మ‌రి.. ఈ అగ్నిపరీక్ష‌లో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Related Posts