Categories: FeaturedLatest

Perni nani : రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా : మాజీ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం : తాను రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నానంటూ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. మరోసారి జగన్‌తో సమావేశం అవుతానో లేదో అంటూ ఆయన చెప్పడం గమనార్హం.

మచిలీపట్నం అభివృద్ధికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని పేర్ని నాని అన్నారు. బందరుకు సీఎం జగన్‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. ‘‘బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు వచ్చాయి. బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు’’ అని చెప్పారు.

మరోసారి జగన్‌తో వేదిక పంచుకునే అవకాశం దక్కుతుందో లేదో అంటూ తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి పేర్ని నాని ప్రస్తావించారు. ఎక్కువ సేపు మాట్లాడటంపై పక్కనున్న వారు అభ్యంతర పెట్టగా.. ‘‘లాస్ట్ ఇదే.. మళ్లీ జగన్ తో కలిసి నేను మీటింగ్ లో పాల్గొంటానో లేదో తెలియదు.. ఇప్పుడు నన్ను భరించాల్సిందే’’ అని అన్నారు. మరో సందర్భంలో ‘‘అందుకే రిటైర్ అయిపోతున్నా’’ అని చెప్పారు.

‘‘జగన్ చెప్పారంటే చేస్తారు. మనందరి గుండెల్లో సుస్థిరమైన, బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సీఎం జగన్‌. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తెస్తున్న జగన్‌కు పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడైపోయాడు. అందుకే చేతులెత్తి మొక్కుతున్నా’’ అన్నారు.

Telugu 70mm

Recent Posts

పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప 2’ ప్రభంజనం

'పుష్ప 2' మ్యూజికల్ జర్నీ ఇటీవలే మొదలైంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'పుష్ప పుష్ప'…

2 hours ago

Mollywood Blockbusters Are Coming To OTT

Four blockbusters have come out of Malayalam in a very short time like never before.…

2 hours ago

Nara Rohit’s ‘Prathinidhi 2’ to release on May 10

Politics in Telugu states has become more heated now. At such a time, the original…

17 hours ago

New schedule of ‘Double Ismart’ started in Mumbai

Dashing Puri Jagannadh and Ustad Ram's combo 'Ismart Shankar' became a super duper hit. Now…

17 hours ago

మాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి

గతంలో ఎప్పుడూ లేనివిధంగా మలయాళం నుంచి చాలా తక్కువ సమయంలో నాలుగు బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ఆ చిత్రాలే 'ప్రేమలు, ది…

17 hours ago

మే 10న రాబోతున్న నారా రోహిత్ ‘ప్రతినిధి 2’

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి…

17 hours ago