నిర్మాతలకి గుదిబండలా మారిన హీరోల రెమ్యూనరేషన్స్

పెద్దాయన ఎన్టీఆర్ ఎప్పుడూ తన సినిమా బడ్జెట్ ని తక్కువగా ఉండేట్లు చూసుకునేవారట. ఎంత తక్కువ అంటే, తను అంతకు ముందు చేసిన ఫ్లాప్ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో చూసుకుని, దానికన్నా తక్కువ బడ్జెట్ తో సినిమా తీయమని నిర్మాతలకు చెప్పేవారట. అందువల్ల సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు సేఫ్ గా ఉండేవారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ గారైతే, తన సినిమా ఫ్లాప్ అయితే, నిర్మాతను పిలిచి మళ్ళీ ఇంకో సినిమాకి డేట్స్ ఇచ్చి, అవసరం అయితే తనే ఫైనాన్సర్స్ కి స్యూరిటీ కూడా ఇచ్చేవారట. అందుకే అప్పట్లో సినిమా పరిశ్రమలో పెద్దగా సంక్షోభాలు లేవు.

ఎప్పుడైతే సినిమాల్లోకి ఈజీ మనీ, అంటే, రియల్ ఎస్టేట్ డబ్బు, రాజకీయనాయకుల అవినీతి డబ్బు సినిమాలకి పెట్టుబడిగా రావడం మొదలయిందో..అప్పుడు లెక్కలు మారిపోయాయి.డేట్స్ కోసం పోటీపడి హీరోల రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తున్నారు. హీరో, డైరెక్టర్ ల రెమ్యునరేషన్లే 75 కోట్లు దాటుతున్నాయి. అందుకే, సినిమా యావరేజ్ టాక్ వచ్చినా, ఒక మోస్తరు హిట్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అవడం లేదు. సినిమా సూపర్ హిట్ అయితేనే అందరికీ డబ్బులు వస్తున్నాయి.

OTT ద్వారా వచ్చే ఆదాయం చూపించి హీరోలు రెమ్యునరేషన్లు పెంచేశారు. కానీ అదే OTTల వలన థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా పడిపోయి నష్టాలు వస్తున్నాయి.ఇక, ఇప్పుడు షూటింగ్ లు బంద్ చేయడం ఈ సమస్యకి ఏ మాత్రం పరిష్కారం కాదు. బంద్ చేయడం అనేది నిరసన తెలపడం లేదా కొన్ని డిమాండ్స్ సాధించుకునే మార్గం. ఇప్పుడు సినిమా షూటింగ్ ల బంద్ అనేది నిరసన అనుకుంటే ఎవరి మీద నిరసన? డిమాండ్ల సాధనకోసం అంటే ఆ డిమాండ్లు ఏంటి?

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

5 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

9 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

9 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

12 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

13 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

15 hours ago