డేనియల్ శేఖర్ గా రానా రోరింగ్

దగ్గుబాటి రానా బర్త్ డే స్పెషల్ గా విరాట పర్వం నుంచి విడుదల చేసిన వాయిస్ ఆఫ్ రవన్న ఆకట్టుకుంది. అయితే అంతకంటే పెద్ద సినిమాగా వస్తోన్న భీమ్లా నాయక్ నుంచి కూడా మరో టీజర్ విడుదల చేశారు. ఈ మూవీలో రానా డేనియల్ శేఖర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అతనికి భీమ్లా నాయక్ కు మధ్య జరిగే వార్ గానే ఉంటుందీ సినిమా. ఓ రకంగా ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ తో సాగుతుందీ చిత్రం. అందులో భాగంగానే ఈ సారి రానా టీజర్ ను ఆరేంజ్ లోనే విడుదల చేశారు.

‘వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగల్ను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్సై.. సస్సెండెడ్..’అంటూ రానా అగ్రెసివ్ గా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. రానా లుక్, పర్ఫార్మెన్స్ కాన్ స్టంట్ గా కనిపిస్తున్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ చిన్న టీజర్ లోనే తమన్ నేపథ్యం సంగీతం రోమాంఛితంగా ఉంది. ఇప్పటికే అతని పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ కూడా బాక్సాఫీస్ ను బద్ధలు కొడుతుందని ఊహించొచ్చు.
మళయాల బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది. సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నాడు. లాలా భీమ్లా నాయక్ అనే టైటిల్ సాంగ్ ను కూడా త్రివిక్రమ్ రాశాడు.
మొత్తంగా భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ వర్సెస్ రానాగా ఓ రేంజ్ లో ఫీస్ట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది.

Related Posts