రాజధాని ఫైల్స్‌ సమాజానికి ఉపయోగపడే మూవీ

అమరావతి రైతుల ఆవేదన, కన్నీళ్లు కష్టాలే బ్యాక్‌డ్రాప్‌ గా రాబోతున్న మూవీ రాజధాని ఫైల్స్‌. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 15 న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు భాను విలేకరులతో ముచ్చటించారు.మొదట అమరావతి ఫైల్స్ పేరుతోనే తీశాం. సెన్సార్ కి వెళ్ళినప్పుడు ఫిక్షనల్ చేస్తేనే సెన్సార్ ఇస్తామని చెప్పారు. వారు చెప్పిన కరెక్షన్స్ చేశాం. టైటిల్ ని రాజధాని ఫైల్స్ గా మార్చామన్నారు.ప్రజల ఆవేదనని చూపించే చిత్రమిది.ఇది రాజకీయ చిత్రం కాదు ప్రజల చిత్రమని మరోసారి స్పష్టంగా చెబుతున్నానన్నారు.ఇది పొలిటికల్ కంటెంట్ కాదు. రైతుల పడిన ఇబ్బందులు, మానసిక సంఘర్షణ, వారిని ఇబ్బంది పెట్టె మనుషులు, న్యాయం కోసం రైతులు చేసిన పోరాటం తప్పితే పొలిటికల్ కోణం ఇందులో వుండదు. ఇందులో సమస్యకి పరిష్కారం కూడా చూపించామన్నారు.ఇది రైతుల కథ. వారి జీవితాల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టిన వారి పాత్రలనే తీసుకున్నాం కానీ ఎవరి వ్యక్తిగతాల జోలికి పోలేదన్నారు. అమరావతి వెళ్లి బాదిత రైతులతో ఈ సినిమా చిత్రీకరణ చేశామన్నారు.


రవిశంకర్ గారు సినిమా చేయలన్నప్పుడు ముందు భయపడ్డాను. అయితే ఒక సామజిక భాద్యతతో నిర్మాత సినిమా తీస్తామని వచ్చినప్పుడు చేయాలనిపించింది. ముందు అమరావతి రైతులని కలిశాను. వారు పడిన ఇబ్బందులు చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఓ అమ్మాయిని పోలీసులు అమానుషంగా కొట్టారు. ఇప్పటికీ ఆ అమ్మాయి లేవలేకపోతుందన్నారు.


ఈ కథలోనే బర్నింగ్ వుంది. నేచురల్ గా కనిపించాలని తీశాను. ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు ఒక సజీవ చిత్రంలా వుందని చెప్పడానికి కారణం ఇదే. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కాకుండా కళ్ళముందు జరుగుతన్న కథలా కనిపిస్తుందన్నారు.


ఈ సినిమాతో జీవితానికి ఈ ఒక్కటి చాలు అనిపించింది. ఈ సినిమా ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది. ఇది జాతీయ జెండా లాంటి సినిమా. ప్రజల సినిమా. సమాజానికి ఉపయోగపడే సినిమా అన్నారు దర్శకుడు భాను.
రైతు ప్రతినిధి పాత్రలో వినోద్ కుమార్ గారు, రైతు భార్యగా వాణీ విశ్వనాథ్ గారు కనిపిస్తారు. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మాటలు, పాటలు, ఎడిటింగ్ అన్నీ వున్నత స్థాయిలో వుంటాయి. ఇది యూనీవర్సల్ అందరికీ నచ్చే సినిమా అన్నారు డైరెక్టర్ భాను.

Related Posts