అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సక్సెస్‌మీట్.

వాస్తవ సంఘటనలతో, స్వచ్చమైన ప్రేమకథతో.. సినిమాటిక్ లిబర్టీకి కాస్త దూరంగా రియలిస్టిక్ అప్రోచ్‌ తో తెలుగు మేకర్స్ కూడా సినిమాలు తీయగలరు అని రీసెంట్ గా బేబీ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో తెలుగు సినిమా సత్తాను సౌండ్ చేస్తున్నారు తెలుగు దర్శకనిర్మాతలు. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా పెద్ద స్టార్ క్యాస్ట్ లేకున్నా కంటెంట్ బలంతో.. ప్రతిభావంతమైన ప్రజెంటేషన్‌తో అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. దుష్యంత్‌ కటినేని డైరెక్షన్‌లో సుహాస్, శివాని నాగరం జంటగా.. శరణ్యప్రదీప్, నితిన్ కీలక పాత్రలో గీతాఆర్ట్స్‌ సమర్పణలో ధీరజ్, వెంకటేష్‌ మహా సంయుక్త సమర్పణలో రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.


“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” తో హిట్ అందుకున్న మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలి. అమ్మా నాన్న తర్వాత నేను రుణపడి ఉండేది మా డైరెక్టర్ దుశ్యంత్ గారికే. ఆయన నన్ను హిట్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సుహాస్ వల్లే ఇవాళ ఇలాంటి మంచి సినిమా వచ్చింది. సుహాస్ కు సక్సెస్ కంటిన్యూ కావాలి. లీడ్ పెయిర్ కే కాదు మిగతా ఆర్టిస్టులందరికీ మంచి పేరొచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు హీరోయిన్ శివాని నాగరం.
ఇలాంటి కథలు రాయడంతోనే సరిపోదు ప్రొడ్యూస్ చేసే ధైర్యం గల వాళ్లు కావాలి. గీతా ఆర్ట్స్, ధీరజ్ గారు, బన్నీ వాస్ గారు ఆ ధైర్యం చేశారు. ప్రొడ్యూసర్స్ తో పాటు కథను నమ్మిన హీరో సుహాస్ కు థ్యాంక్స్. సినిమా చూసిన వాళ్లంతా ప్రతి సీన్ గురించి మాట్లాడుతున్నారు. హీరో హీరోయిన్ బ్రేకప్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్..ఇలా ప్రతి ఒక్కటీ గుర్తుపెట్టుకుంటున్నారు. టీమ్‌ అందరికీ థ్యాంక్స్ చెప్పారు డైరెక్టర్‌ దుష్యంత్‌.


“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఒప్పుకునే టైమ్ కు నేను కో ప్రొడ్యూస్ చేసిన డీజే టిల్లు, బేబి మూవీస్ హిట్ అయ్యాయి. అంత పెద్ద సినిమాలు చేసిన నువ్వు ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని కొందరు అడిగారు. అవి వేరే జానర్ మూవీస్..ఈ సినిమా జానర్ వేరు అని చెప్పా. నా దృష్టిలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఒక జెన్యూన్ మూవీ. ఈ కథ విన్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. కొందరు స్టార్ హీరోను తీసుకో అని చెప్పినా..నేను సుహాస్ అయితేనే ఈ కథకు కరెక్ట్ అని నమ్మాను. చాలా మంది కొత్త వాళ్లకు మేము ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చామనే సంతృప్తి ఏర్పడిందన్నారు ప్రొడ్యూసర్ ధీరజ్‌.


నాకు హ్యాట్రిక్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నన్ను నమ్మి థియేటర్స్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా రిలీజ్ ముందే నేను, ధీరజ్ గారు అనుకున్నాం ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని. ఇవాళ ఆ మాట నిజమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హీరోతో పాటు మిగతా క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్ లో ఉన్న స్ట్రెంత్. మిగతా వారు బాగా పర్ ఫార్మ్ చేసినా సినిమా హిట్టైన పేరు హీరోకే పేరొస్తుంది. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”కు పనిచేసిన ప్రతి ఒక టీమ్ మెంబర్ కు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు హీరో సుహాస్.

Related Posts