Categories: Latest

దిల్ రాజుకు వారసుడొచ్చాడు..

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన దిల్ రాజుకు కొడుకు పుట్టాడు. అదీ యాభై యేళ్ల వయసులో. 90లలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వెంకటరమణారెడ్డి.. అలియాస్ రాజు.. ఆ తర్వాత తను నిర్మించిన దిల్ సినిమాను ఇంటి పేరుగా మార్చుకుని దిల్ రాజుగా మారాడు. నిర్మాతగా తిరుగులేని విజయాలు అందుకున్నాడు. ఏకంగా నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ ను అందుకున్నాడు. జాతీయ పురస్కారమూ పొందాడు. అతని క్యాంప్ నుంచి ఎంతోమంది దర్శకులు వచ్చారు. తమ్ముళ్లతో కలిసి చిత్ర నిర్మాణం చేసిన దిల్ రాజుకు కొడుకులు లేరు. ఒకే కూతురు. భార్య అనిత. ఆమె కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. దిల్ రాజుకు భార్యంటే చాలా ఇష్టం అని చెప్పేవారు. ఆమె సమర్పణలోనే తన చిత్ర నిర్మాణం కొనసాగేది. అలాంటి తను మరణించిన తర్వాత ఇటు కొడుకులు కూడా లేకపోవడం, ఉన్న కూతురుకు పెళ్లి కావడంతో ఒంటరివాడయ్యాడు. దీంతో అతని కూతురే చొరవ తీసుకుని రాజును రెండో పెళ్లికి ఒప్పించింది. వరంగల్ కు చెందిన తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు. ఆమెకే ఇప్పుడు కొడుకు పుట్టాడు. రాజుకు ఇప్పుడు 51యేళ్లు. ఈ వయసులో ఇంటికి వారసుడు రావడానికి మించిన ఆనందం ఏముంటుంది. అందుకే దిల్ రాజు ఇంట సంబరాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం నిర్మాతగా తన ప్రొడక్షన్ హౌస్ ను ప్యాన్ ఇండియా లెవల్లో విస్తరిస్తున్నాడు దిల్ రాజు. తెలుగులో హిట్ అయిన “హిట్” ఫస్ట్ కేస్ చిత్రాన్ని బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు హీరోగా రీమేక్ చేశాడు. ఇటు తెలుగులోనూ రామ్ చరణ్‌, శంకర్ కాంబోలో ఓ చిత్రం, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రెండు భారీ చిత్రాలు నిర్మిస్తున్నాడు. మొత్తంగా దిల్ రాజుకు కొడుకు పుట్టిన విషయం పరిశ్రమలోనూ ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు.

Telugu 70mm

Recent Posts

PrarthanaChabbria

14 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

15 hours ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

15 hours ago

Pooja Hegde

15 hours ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

15 hours ago

ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

16 hours ago